ఈ సంక్షోభ సమయంలో పాలస్తీనా ప్రజల కోసం సాయం చేసే మూడు స్వచ్ఛంద సంస్థలకు తాను రూ. 2.5 కోట్లు విరాళంగా ఇస్తానని, ప్రజలు కూడా స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. తక్షణ కాల్పుల విరమణకు, శాశ్వత శాంతి కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Joe Biden: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో దారుణ సంఘటన జరిగింది. గాజాలోని అల్-అహ్లీ ఆస్పత్రిపై దాడి జరిగింది. ఈ దాడిలో 500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ప్రధాని మోదీతో పాటు యూఎన్ ఈ దాడిని ఖండించాయి. ఈ దాడి జరిపిన వారే దీనికి బాధ్యత వహించాలని ప్రధాని మోదీ అన్నారు. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయిల్‌కి సంఘీభావం తెలిపేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం…
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం తీవ్రమవుతోంది. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై క్రూరమైన దాడి చేశారు. ఈ దాడిలో 1400 మంది చనిపోయారు. 199 మందిని బందీలుగా గాజాలోకి తీసుకెళ్లారు. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇజ్రాయిల్, హమాస్ ని పూర్తిగా అతుముట్టించేలా గాజా స్ట్రిప్‌పై భీకరదాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే మంగళవారం గాజాలోని ఓ ఆస్పత్రిపై జరిగిన దాడిలో 500 మంది మరణించారు.
Israel-Hamas War: అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ వైమానికదళం గాజా స్ట్రిప్‌పై నిప్పుల వర్షం కురిపిస్తోంది. హమాస్ ఉగ్ర స్థావరాలతో పాటు ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం ఉన్న అన్ని ప్రాంతాలు, బిల్డింగులపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్, పాలస్తీనాలోని గాజాపై భూతల దాడులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే గాజా ఉత్తర ప్రాంతంలోని పాలస్తీయన్లు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశించింది ఇజ్రాయిల్ ఆర్మీ.
Israel-Hamas War: అక్టోబర్ 7నాడు ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడిని ఇజ్రాయిల్ మరిచిపోలేకపోతోంది. ఇజ్రాయిల్ ఏర్పడినప్పటి నుంచి ఇలాంటి దాడిని ఎప్పుడూ చూడలేదు. మెస్సాద్ వంటి గూఢాచర సంస్థ, పటిష్ట ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నప్పటికీ దాడిని ముందుగా పసిగట్టలేకపోయింది.
Israel-Hamas War: హమాస్ చేసిన తప్పులకు గాజా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. దొరికినవారిని దొరికినట్లు దారుణంగా చంపేశారు. ఆడవాళ్లపై అత్యాచారాలకు తెగబడంతో పాటు అభంశుభం తెలియని చిన్నారులను తలలు నరికి చంపారు. ఈ దాడుల్లో ఇజ్రాయిల్ వైపు 1300 మంది ప్రజలు మరణించారు. ఈ దాడితో తీవ్ర ప్రతీకారేచ్ఛతో ఇజ్రాయిల్ రగిలిపోతోంది. గాజాపై నిప్పుల వర్షం కురిపిస్తోంది.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం భీకరంగా సాగుతోంది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ లో జరిగిన క్రూరమైన హత్యలకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) బలగాలు వైమానిక దాడులు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే భూతల దాడులు నిర్వహించేందుకు సైన్యం సిద్ధమైంది. పాలస్తీనా ప్రజలు గాజా ఉత్తర ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని ఇప్పటికే ఐడీఎఫ్ హెచ్చరించింది.
Israel: ఇజ్రాయిల్‌పై దాడికి తెగబడిన ఒక్కో హమాస్ కీలక నేతల్ని ఇజ్రాయిల్ ఆర్మీ హతం చేస్తోంది. ఇప్పటికే పలువురు కీలక ఉగ్రవాదులు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) దాడుల్లో హతమయ్యారు. ఇందులో హమాస్ ఎలైట్ గ్రూప్ ‘నుఖ్బా ఫోర్స్’ అల్ కేద్రాను హతమార్చినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. మిగతా హమాస్ ఉగ్రవాదులందరికీ ఇదే గతి పడుతుందని ఐడీఎఫ్ హెచ్చరించింది. ఇప్పటికే హమాస్ వైమానికి దళానికి చీఫ్ గా ఉన్న మరో ఉగ్రవాది మురాద్ అబు మురాద్‌ని హతం చేసినట్లు టైమ్స్…
China: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. అక్టోబర్7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ లోకి చొరబడి ప్రజలు ఊచకోత కోశారు. ఈ దారుణ ఘటనలో 1300 మంది ఇజ్రాయిలు చంపబడ్డారు. దీంతో పాటు 150 మందిని హమాస్ మిలిటెంట్లు బందీగా గాజాకు తీసుకెళ్లారు. ఈ దాడి వల్ల ప్రతీకారంతో రగిలిపోతున్న ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై భీకరదాడులు చేస్తోంది. వైమానిక దళం గాజా నగరంతో పాటు ఉత్తర ప్రాంతాన్నిటార్గెట్
Israel-Hamas War: హమాస్ ఉగ్రవాదుల నుంచి ఇజ్రాయిల్ క్రూరమైన దాడిని ఎదుర్కొంది. గాజా నుంచి వచ్చి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ భూభాగంలోకొ చొరబడి సాధారణ ప్రజానీకంపై దారుణాలకు ఒడిగట్టారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దొరికిన వాళ్లను దొరికినట్లు హతమార్చారు. మహిళపై హత్యాచారాలకు ఒడిగట్టారు. రోడ్లపై వెళ్తున్న కార్లను షూట్ చేశారు. కార్ల పెట్రోల్ ట్యాంకులను, ఇంజన్ల టార్గెట్ చేసి, అవి ఆగిపోయిన తర్వాత నిస్సాయకంగా ఉన్న వ్యక్తుల్ని కాల్చి చంపారు.