Home
Hamas Attack On Israel
Hamas Attack On Israel News
-
Israel-Hamas War: గాజాలో ఆకలి కేకలు.. కలుపు మొక్కలు, పశుగ్రాసమే ఆహారం..
Israel-Hamas War: ఇజ్రాయిల్ హమాస్ మిలిటెంట్ల దాడి సాధారణ పాలస్తీనియన్లను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టేసింది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని దారుణంగా చంపేసింది. మరికొందరిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. ఇప్పటివరకు మరణాల సంఖ్య 30,000లను దాటింది. ఇదిలా ఉంటే ఇప్పుడు గాజాలోని ప్రజలు ఆకలితో దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఆహారం, మందులు లేక విలవిల్లాడుతున్నారు. ఉత్తర గాజా నుంచి వేల మంది పాలస్తీనియన్లు… -
Gaza War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో 28,000 దాటిన మృతుల సంఖ్య..
Gaza War: హమాస్ అంతాన్ని చూసే దాకా ఇజ్రాయిల్ గాజాలో యుద్ధాన్ని ఆపేలా కనిపించడం లేదు. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని చంపేశారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ పాలస్తీనా భూభాగాలైన గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్‌పై విరుచుకుపడుతోంది. హమాస్ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. హమాస్ అంతమయ్యేదాకా యుద్ధాన్ని విరమించేంది లేదని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ పలు సందర్భాల్లో వెల్లడించారు. -
Israel: గాజా యూనివర్సిటీని బాంబులతో పేల్చేసిన ఇజ్రాయిల్.. వీడియో వైరల్..
Israel: అక్టోబర్ 7నాటి హమాస్ దాడి తర్వాత ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్‌పై దాడులకు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మరింత తీవ్రతరం చేస్తోంది. హమాస్ ఉగ్రవాదుల్ని పూర్తిగా తుదముట్టించే వరకు వదిలేది లేదని ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వెల్లడించారు. ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పారు. మరోవైపు తాజాగా నెతన్యాహూ మాట్లాడుతూ.. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించేది లేదని స్పష్టం చేశారు. -
Benjamin Netanyahu: హమాస్ నాశమయ్యే వరకు యుద్ధం ఆగదు.. స్పష్టం చేసిన ఇజ్రాయిల్ ప్రధాని..
Benjamin Netanyahu: ఇజ్రాయిల్ తన అన్ని లక్ష్యాలను సాధించే వరకు యుద్ధాన్ని ఆపబోదని మరోసారి ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్ నాశనం అయ్యేంత వరకు గాజా యుద్ధం ఆగేది లేదని ప్రకటించారు. మూడు నెలల క్రితం హమాస్ మాపై దారుణమైన దాడికి పాల్పడ్డారు, హమాస్ నిర్మూలించాలని, బందీలను తిరిగి తీసుకురావాలని, గాజా నుంచి ఇజ్రాయిల్‌పై మరోసారి దాడులు ఎదురుకావద్దని తాను ఇజ్రాయిల్ ఆర్మీని ఆదేశించినట్లు ప్రధాని నెతన్యాహూ చెప్పారు. -
Hamas: “మహిళల్ని చుట్టుముట్టి ఒకరు రేప్ చేస్తుంటే, మిగతా వాళ్లు నవ్వారు”.. వెలుగులోకి హమాస్ అకృత్యాలు..
Hamas: హమాస్ ఉగ్రవాదుల అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అక్టోబర్ 7 నాటి దాడి సమయంలో మహిళలపై హమాస్ ఉగ్రవాదులు అత్యాచారాలకు పాల్పడుతూ, వారిని హత్యలు చేశారు. చిన్న పెద్దా, ముసలి వారనే తేడా లేకుండా హత్యలు చేశారు. చిన్న పిల్లల తలలను వేరు చేస్తూ రాక్షస ఆనందం పొందారు. ఆ దాడి సమయంలో జరిగిన సంఘటనల గురించి ఓ ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. సీఎన్ఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బందీల్లో ఒకరైన రాజ్ కోహెన్ హమాస్ ఉగ్రవాదుల… -
Israel: ఇజ్రాయిల్ దాడిలో హమాస్ డిప్యూటీ చీఫ్ హతం.. ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధమని వార్నింగ్..
Israel: హమాస్ నాయకత్వాన్ని తుడిచిపెట్టే దిశగా ఇజ్రాయిల్ కదులుతోంది. తాజాగా హమాస్ డిప్యూటీ చీఫ్ సలేహ్ అల్-అరౌరీని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) చంపేసింది. లెబనాన్ రాజధాని బీరూట్‌లో ఉన్న అల్-అరౌరీపై దాడి చేసి హతమార్చింది. మంగళవారం జరిగిన ఈ ఘటన మరోసారి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు కారణమైంది. మరోవైపు ఈ దాడిని లెబనాన్ ప్రధాని ఖండించారు. మరోవైపు ఇతని మరణానికి హమాస్‌తో పాటు హిజ్బుల్లా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించాయి. -
Israel-Hamas War: భార్య ఉండటం వల్లే తనపై అత్యాచారం చేయలేదు.. బందీగా బయటపడిన యువతి
Israel-Hamas War: అక్టోబర్ 7 నాడు హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడి చేశారు. ఈ దాడిలో 1200 మందిని చంపడమే కాకుండా.. 240 మందిని కిడ్నాప్ చేసి గాజాకు తీసుకెళ్లారు. అయితే ఇటీవల ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో కొన్ని రోజుల పాటు ఇజ్రాయిల్, హమాస్ మధ్య సంధి ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో కొంతమంది బందీలను హమాస్ విడిచిపెట్టగా.. అందుకు ప్రతిగా ఇజ్రాయిల్ తన జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. -
Israel-Hamas War: హమాస్ టెన్నెల్స్లో ఐదుగురు బందీల మృతదేహాలు.. గాజా దాడిలో 78 మంది మృతి
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ వార్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. హమాస్ ఉగ్రసంస్థను నేలమట్టం చేసేదాకా యుద్ధాన్ని ఆపేది లేదని ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రపంచదేశాల నుంచి వస్తున్న ఒత్తిడిని సైతం లెక్క చేయకుండా హమాస్‌పై పోరుసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే గాజాలోని హమాస్ కీలక టన్నెల్ వ్యవస్థనున కుప్పకూల్చేందుకు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) పనిచేస్తున్నాయి. ఇప్పటికే ఆ టన్నెల్స్‌ని సముద్ర నీరుతో ముంచేయాలని ప్లాన్ చేసింది. -
PM Benjamin Netanyahu: “యూదు స్త్రీలు కాబట్టే మౌనంగా ఉన్నారా..?” హక్కుల సంఘాలపై ఇజ్రాయిల్ పీఏం ఆగ్రహం..
PM Benjamin Netanyahu: అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు, మహిళా సంఘాలు, ఐక్యరాజ్యసమితిపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ మహిళలపై హమాస్ చేస్తున్న అత్యాచారాలు, దురాగతాలపై మాట్లాడటంతో ఇవన్నీ విఫలమయ్యాయని బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘ఇజ్రాయిల్ మహిళలపై అత్యాచారారాలు, భయంకరమైన అఘాయిత్యాలు, లైంగిక దాడులు జరుగుతున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు’’ అని ఎక్స్(ట్విట్టర్)ద్వారా ప్రశ్నించారు. -
Israel-Hamas War: భారీ పంపులను సిద్ధం చేస్తున్న ఇజ్రాయిల్.. హమాస్ టన్నెల్స్‌లో వరదలకు ప్లాన్..
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ సంధి తర్వాత గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిలీ ఆర్మీ విరుచుకుపడుతోంది. ఇన్నాళ్లు ఉత్తర గాజాకే పరిమితమైన యుద్ధా్న్ని, దక్షిణంలోని సురక్షిత ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. హమాస్ ఉగ్రసంస్థను లేకుండా చేసేందుకు ఇజ్రాయిల్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ.. ఆ దేశ స్పై ఏజెన్సీ మొసాద్కి హమాస్ కీలక నేతలను హతం చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
తాజావార్తలు
-
Fire Accident: విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్‌లో అగ్నిప్రమాదం.. సీ హార్స్ జంక్షన్ సమీపంలో ఎగిసిపడుతున్న మంటలు..
-
Uttarakhand Helicopter Crash: ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి.?
-
NZ Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్స్ అవుట్.. కీలక మార్పులు చేసిన బీసీసీఐ..
-
Madras High Court: CJP నేత సౌరవ్ దాస్ ఎవరు.? బ్యాక్‌గ్రౌండ్ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
-
Fake Aadhar: నిమిషాల్లో నకిలీ ఆధార్, పాన్ కార్డులు.. గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!