వారణాసి జ్ఞానవాపీ మసీదు కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న హిందూ విగ్రహాలను ఆరాధించేందుకు అనుమతి ఇవ్వాలని 2021 ఆగస్టులో రాఖీ సింగ్‌తో పాటు మరో నలుగురు మహిళలు పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు ఆ పిటిషన్ కు సంబంధించి పిటిషనర్ రాఖీ సింగ్ రాష్ట్రపతికి లేఖ రాశారు.
వారణాసిలోని జ్ఞాన్‌వాపి కాంప్లెక్స్‌లో పూజించే హక్కును కోరుతూ హిందువులు చేసిన విజ్ఞప్తిని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. వారణాసిలోని జ్ఞానవాపిలో కొలువై ఉన్న శృంగార గౌరీని నిత్య పూజించే హక్కు విషయంలో హిందూ పక్షానికి అనుకూలంగా నిర్ణయం వచ్చింది.
Gyanvapi Case: వారణాసి జ్ఞానవాపి మసీదు కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. మసీదులోని వాజుఖానాలో దొరికిన ‘‘శివలింగం’’గా చెప్పబడుతున్న ఆకారానికి కార్బన్ డేటింగ్ పై ఏప్రిల్ 15 లోగా స్పష్టత ఇవ్వాలని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)ని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. కార్బన్ డేటింగ్ ప్రక్రియ వల్ల శివలింగం దెబ్బతింటుదా..? అనేదానిపై ఏఎస్ఐ తన ప్రతిస్పందన తెలియజేయడానికి చివరి అవకాశం ఇచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 5కి వాయిదా వేసింది. కార్బన్ డేటింగ్ వల్ల మసీదు, అందులోని…
SC grants Centre two more weeks to file response on pleas challenging Places of Worship Act 1991: ప్రార్థనా స్థలాల చట్టం-1991లోని నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందించేందుకు కేంద్రానికి మరో రెండు వారాలు గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. అక్టోబర్ 31 లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. నవంబర్ 14న విచారణను వాయిదా వేసింది. 1991 ప్రార్థన స్థలాల చట్టంలోని కొన్ని నిబంధనలను సవాల్ చేస్తూ దేశవ్యాప్తంగా…
ఈ ఏడాదిలో ప్రారంభం అయిన జ్ఞానవాపి మసీదు కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ముందుగా వారణాసి సివిల్ కోర్టు మసీదులో వీడియో సర్వేకు అనుమతి ఇవ్వడంతో అక్కడి వాజూఖానాలో శివలింగం వంటి ఆకారం బయటపడింది.
జ్ఞానవాపీ మసీదు కేసులో బయటపడిన శివలింగానికి కార్బన్ డేటింగ్ జరపాలంటూ హిందూ మహిళలు వేసిన పిటిషన్‌పై తీర్పును వారణాసి కోర్టు అక్టోబర్ 11వ తేదీకి వాయిదా వేసింది.
Crucial Court Order Today On Carbon Dating Of 'Shivling' In Gyanvapi Case: ఈ ఏడాదిలో ప్రారంభం అయిన జ్ఞానవాపి మసీదు కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ముందుగా వారణాసి సివిల్ కోర్టు మసీదులో వీడియో సర్వేకు అనుమతి ఇవ్వడంతో అక్కడి వాజూఖానాలో శివలింగం వంటి ఆకారం బయటపడింది. ఒక్కసారిగా ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరో వైపు అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం.. ఆ తరువాత ఈ…
Hindu Side Moves Plea Seeking Carbon Dating Of 'Shivalinga': జ్ఞానవాపి మసీదు కేసులో గురువారం వారణాసి కోర్టులో కీలక వాదనలు జరిగాయి. హిందూ పక్షం న్యాయవాది విష్ణు జైన్, జ్ఞానవాపి మసీదులో ఉన్న శివలింగానికి ‘కార్బన్ డేటింగ్’చేయాలని శివలింగంగా చెబుతున్న ఆకారంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై వారణాసి జిల్లా కోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 29కి వాయిదా వేసింది.
జ్ఞానవాపి మసీదు- శృంగర్ గౌరీ కేసులో దాఖలైన వ్యాజ్యంపై వారణాసి జిల్లా కోర్టు సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. మతపరమైన సున్నితమైన అంశంలో జిల్లా న్యాయమూర్తి ఏకే విశ్వేష్ గత నెలలో ఉత్తర్వులను సెప్టెంబర్ 12 వరకు రిజర్వ్ చేశారు.