విశాఖలో సంక్రాంతి సందడి మొదలైంది. సాంప్రదాయ దుస్తుల్లో యువతీ యువకులు ఎంజాయ్ చేస్తున్నారు. డు..డు.. బసవన్నలు, గంగిరెద్దుల హడావిడి మొదలైంది. తెలుగుతనం ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. మరోవైపు.. రాజ్యసభ మాజీ ఎంపీ, సీనియర్ బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో పెద్ద పండుగ సంబరాలు అట్టహాసంగా మొదలయ్యాయి.
విశాఖ అభివృద్ధి చెందిన నగరంగా నీతి ఆయోగ్ రోడ్డు మ్యాప్ లో విశాఖకు స్థానం లభించిందని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ తెలిపారు. విశాఖ అభివృద్ధికి భారీగా నిధులు రాబోతున్నాయని.. గ్రోత్ హబ్ గా మారుతుందన్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. ఈనెల 15న వైజాగ్ లో నీతి ఆయోగ్ సమావేశం జరగనుందని చెప్పారు. ఇదిలా ఉంటే.. దేశ ప్రజలు మరోసారి మోదీ సర్కార్ కోరుకుంటున్నారని.. 404 సీట్లతో మూడోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని జీవీఎల్ చెప్పారు.
విశాఖలో బీజేపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో రేపు ఘనతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపు(శుక్రవారం) ఉదయం ఆరు గంటలకు ఆర్కే బీచ్ రోడ్డులో రిప్లబిక్ ఫ్రీడమ్ కలర్ వాక్ నిర్వహిస్తున్నామని తెలిపారు. నాలుగు వందల మీటర్లు పొడువైన జాతీయ జెండాతో వాక్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రేపు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు పిల్లలకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే.. సాయంత్రం టాలీవుడ్ సింగర్ అరుణ్ కౌండిన్య,…
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖలో సంక్రాంతి సంబరాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కనుమ రోజున విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఓ రిక్షావాలాను కూర్చోబెట్టుకుని జీవీఎల్ రిక్షా తొక్కారు. సంప్రదాయ పంచెకట్టులో నడుముకు కండువా బిగించి రిక్షా తొక్కారు. తర్వాత.. ఆ రిక్షా కార్మికుడికి కొంత డబ్బులు ఇచ్చారు. అయితే.. దీనికి సంబంధించిన వీడియోను జీవీఎల్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో షేర్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనపై దేశ వ్యాప్తంగా బీజేపీ సదస్సులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతోన్న సదస్సుల్లో ముఖ్య నేతలు పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ పాల్గొన్నారు. 9 ఏళ్ల మోడీ పాలనలో తీవ్రవాదాన్ని అణిచి వేశామని జీవీఎల్ తెలిపారు. అంతేకాకుండా ఏపీలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు సీఎం జగన్.. కేంద్ర నిధులతో అమలు చేసే పథకాలకే నవరత్నాలు అనే పేరుతో…
Kanna Lakshminarayana: బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మరోసారి సొంత పార్టీ నేతను టార్గెట్ చేశారు.. కాపు రిజర్వేషన్ల విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. అసలు ఏం సాధించారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. కాపులతో సన్మానాలు చేయించుకుంటున్నారు? అని నిలదీశారు.. గుంటూరులో మీడియాలో మాట్లాడిన కన్న.. ఏపీలో 22 శాతం ఉన్న కాపులు ఎటు ఉంటే అటు అధికారం రావటం 1989 నుంచి చూస్తున్నాం.. ఎన్నికల సమయంలోనే ఓట్లు అవసరం కాబట్టి కాపులను వాడుకుంటారు.. అత్యధిక శాతం ఉన్న…
Andhra Pradesh BJP:ఏపీ బీజేపీ ఏదో అనుకుంటే ఇంకేదో అవుతోందా? రాజధాని అమరావతి విషయంలో బీజేపీని అక్కడి రైతులు ఎందుకు తప్పు పడుతున్నారు? ప్రతికూల రాజకీయ వాతావరణంలో పాదయాత్రతో కమలనాథులకు ప్రయోజనం ఉందా? సోము వీర్రాజుకు రైతులు ఇచ్చిన షాక్‌పై జరుగుతున్న చర్చ ఏంటి?