Andhra Pradesh BJP :: బీజేపీపై అమరావతి రైతులు కోపంగా ఉన్నారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh BJP : ఏపీ బీజేపీ ఏదో అనుకుంటే ఇంకేదో అవుతోందా? రాజధాని అమరావతి విషయంలో బీజేపీని అక్కడి రైతులు ఎందుకు తప్పు పడుతున్నారు? ప్రతికూల రాజకీయ వాతావరణంలో పాదయాత్రతో కమలనాథులకు ప్రయోజనం ఉందా? సోము వీర్రాజుకు రైతులు ఇచ్చిన షాక్‌పై జరుగుతున్న చర్చ ఏంటి?
అమరావతి ప్రాంతంలో చేపట్టిన పాదయాత్రలో ఏపీ బీజేపీ నేతలకు ఎదురైన అనుభవం ఇది. ఏపీ రాజధాని విషయంలో బీజేపీకి నేతలకు క్లారిటీ ఉందో.. లేక అక్కడి రైతలుకు స్పష్టత ఉందో కానీ.. వీర్రాజును నిలదీసిన ఉదంతం మాత్రం అనేక ప్రశ్నలకు వేదికగా నిలుస్తోంది. ఏపీ ఏకైక రాజధాని అమరావతి అనే నినాదాన్ని బీజేపీ అందుకున్నా.. రాజధాని గ్రామాల ప్రజలు ఆ పార్టీపై గుర్రుగా ఉన్నారనడానికి ఈ ఘటన అద్దం పడుతోంది. మూడు రాజధానుల ప్రకటన వచ్చాక ఉద్యమించిన ఇక్కడి రైతులు.. బీజేపీపై ఆశలు పెట్టుకున్నారు. టీడీపీ విపక్షానికి పరిమితం కావడంతో బీజేపీనే ఏదైనా చేస్తుందని ఆశించారు. కానీ.. తమ ఆశలకు.. ఆశయాలకు భిన్నంగా కాషాయ పార్టీ ఉందని చాలా గుర్రుగా ఉన్నారు. అదే బీజేపీ పాదయాత్రలో బయట పడిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Also Read
రాజధాని రైతులు ఉద్యమించిన తొలి నాళ్లల్లో కృష్ణా-గుంటూరు జిల్లాలకు చెందిన కొందరు బీజేపీ నేతలు కలిసి సంఘీభావం తెలియజేశారు. అప్పటి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ లీడ్ తీసుకునేందుకు చూశారు. ఆ ఉద్యమాన్ని బేస్ చేసుకుని రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నించారు. అయితే రైతులు ఆశించిన స్థాయిలో ఆ పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వాల నుంచి మద్దతు లేదనే భావన వారిలో బలంగా పాతుకుపోయింది. ముఖ్యంగా రాజధాని అనేది రాష్ట్రాల పరిధిలోకి వస్తుందని కేంద్రం చేసిన ప్రకటనలు కావచ్చు.. వివిధ సందర్భాల్లో సోము వీర్రాజు, జీవీఎల్, విష్ణువర్దన్ రెడ్డి వంటి నేతలు చేసిన కామెంట్స్ కావొచ్చు.. స్థానిక రైతులకు ఆగ్రహం కలిగించాయి. అప్పట్లో రాజధాని రైతులకు అండగా పాదయాత్ర చేద్దామని జనసేనాని పవన్ కళ్యాణ్ భావించినా.. మిత్రపక్షంగా ఉన్న బీజేపీనే ఆయన ప్రయత్నాన్ని అడ్డుకుందనే ప్రచారం జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజధాని ప్రాంతంలో పర్యటించాలని భావించినా.. దానినీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం అడ్డుకుందనే చర్చ సాగింది. ఇవన్నీ రాజధాని రైతుల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత పెంచాయన్నది రాజకీయ విశ్లేషకుల మాట.
ఆ తర్వాత బీజేపీ గొంతు సవరించుకుని ఒకే రాజధాని అనే నినాదాన్ని టేకప్ చేసినా.. ఇక్కడి రైతులకు అంతగా కనెక్ట్ కాలేదు. ఈ ప్రాంతంలో కేంద్ర సంస్థలు ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ GVL గట్టిగా డిమాండ్ చేసి.. రాజధాని రైతులను కలిసి మాట్లాడారు. తర్వాత దానిని అడ్వాంటేజ్‌గా మార్చుకుని స్థానిక నాయకత్వం ముందుకు తీసుకెళ్ల లేకపోయింది. అందుకే రాజధాని గ్రామాల్లో చేపట్టిన పాదయాత్రలో వీర్రాజుకు చుక్కెదురైందని అభిప్రాయ పడుతున్నారు. బీజేపీపైనా.. సోము వీర్రాజు వైఖరిపైనా తమలో ఉన్న అభిప్రాయాన్ని ఆయన ముఖం మీదే అడిగేశారు. దాంతో కమల నాథులు కంగుతిన్నారు.
తాజా ఘటన తర్వాత బీజేపీ కూడా ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. రాజధాని రైతులకు బీజేపీలోని ఏయే నేతలపట్ల సాఫ్ట్ కార్నర్ ఉందో.. వారితో ఎక్కువగా పర్యటనలు చేపడితే బాగుంటుందని లెక్కలేస్తున్నారట. ఈ క్రమంలో మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేరు చర్చల్లోకి వచ్చిందట. గతంలో ఆయన సంఘీభావ ఉద్యమాలు చేసి ఉండటంతో.. ఆయన ఫీల్డ్‌లోకి వస్తే ప్రతిఘటన ఉండబోదని అనుకుంటున్నారట. మొత్తానికి జనంతో జాగ్రత్తగా ఉండాలని తాజా ఘటనతో కమలనాథులకు గట్టిగానే బోధపడినట్టు ఉంది.
తాజావార్తలు
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు