ఈజీమనీ కోసం దారుణమయిన మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్ళు. నమ్మితే చాలు నట్టేటముంచుతున్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో చెంబుకి అతీతశక్తులు ఉన్నాయని మోసం చేస్తున్న రైస్ పుల్లింగ్ ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. వారి గుట్టును రట్టుచేశారు. చెంబుకి కెమికల్స్ అద్ది బియ్యాన్ని ఆకర్షించేలా చేసింది రైస్ పుల్లింగ్ ముఠా. దీనిని నమ్మేశారు అమాయక జనం. యూట్యూబ్ లో చూసి మోసాన్ని ఎలా చేయాలో నేర్చుకుంది ముఠా. గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి ముఠాను కాంటాక్ట్ చేశారు. అంతే…
గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం తుమ్మలచెరువులో దారుణం జరిగింది. సైదా అనే టీడీపీ కార్యకర్తపై ప్రత్యర్ధులు దాడికి పాల్పడ్డారు. బైక్ పై వెళ్లి వస్తుండగా అడ్డగించి రాళ్ళతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ సైదాని ఆస్పత్రికి తరలించారు.
సినిమా థియేటర్ ఓనర్లతో మంత్రి పేర్ని నాని సమావేశం కానున్నారు. థియేటర్ల రేట్లు, ఆన్‌లైన్ విధానంపై మంత్రి వారితో చర్చించనున్నారు. ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానంపై థియేటర్ యజమానుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సినిమా థియేటర్ ఓనర్లతో మంత్రి సమావేశమై థియేటర్ల ఓపెన్, ప్రస్తుత విధానం నుంచి ఆన్ లైన్ విధానానికి మారే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఆన్‌లైన్ టిక్కెటింగ్ విధానం కోసం రూపొందించే…
గుంటూరులోని స్వరూపనందేంద్ర సరస్వతి స్వామీ జన్మదినం సందర్భంగా ఫీవర్ ఆసుపత్రిలో రోగులకు హోంమంత్రి సుచరిత పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. నిబంధనలకు లోబడి అమరావతి రైతులు పాదయాత్ర చేయాలన్నారు. స్వామీ వారి విశిష్ట సేవలు దేశవ్యాప్తంగా అందుతున్నాయన్నారు. వేద పాఠశాలలో అనేక మంది విద్యార్థులు చదువుతూ సమాజ సేవ చేస్తున్నారన్నారు. స్వామీ వారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకుండాలని ఆమె కోరుకున్నారు. పాదయాత్ర చేస్తూనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నిబం ధనల ఉల్లంఘన జరిగితే…
బుధవారం రాత్రి గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ లో ఓ ఇంట్లో చోరీ జరిగింది. అనుమానితులపై ఫిర్యాదు చేశారు బాధితులు. ఐతానగర్ కు చెందిన నిందితుడు భరత్ కోసం పోలీసులు గాలించారు. పోలీసులను చూసి చెరువులో దూకి గత ఐదారు గంటలపాటు పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు నిందితుడు భరత్. చెరువులో నుండి బయటకు రాగానే పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. చెరువులో నుంచి పోలీసులకు దొరక్కుండా పారిపోయాడు రౌడీషీటర్ భరత్. తనపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ రౌడీ షీటర్…
లైంగిక వేధింపుల ఘటనలపై మహిళా కమిషన్ ఫోన్ ద్వారా కేసు పూర్వ పరాలను తెలుసుకుని బాధితులకు న్యాయం జరిగేలా ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జిల్లాలో వరుస ఘటనలపై పోలీసు అధికారులతో మాట్లాడిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వారికి పలు సూచనలు చేశారు. గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్లలో వివాహితపై వాలంటీర్ దాష్టీకంపై సీరియస్ అయ్యారు. పోలీసు అధికారులతో మాట్లాడిన కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. కేసు పూర్వాపరాలు విచారించి…వాలంటీర్…
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల నిరసన దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతల ఇళ్లపై వైసీపీ కార్యకర్తల దాడులను నిరసిస్తూ ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరుతో చంద్రబాబు ఈ నిరసన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు జగన్ పాలన, వైసీపీ నేతల అరాచకాలపై నిప్పులు చెరిగారు. ఇప్పటి వరకు నేను మూడు సార్లు నిరాహార దీక్ష చేశాను. పార్టీ కార్యాలయంపై వైసీపీ ఉగ్రవాద…
గుంటూరు జీజీహెచ్లో అదృశ్యమైన మూడు రోజుల శిశుశు ఆచూకీ లభ్యమైంది.. బాలుడిని స్వాధీనం చేసుకున్న కొత్తపేట పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.. సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించిన నిందితులే.. బాలుడిని అపహరించినట్టు నిర్ధారణకు వచ్చిన కొత్తపేట పోలీసులు.. రంగంలోకి దిగి వారిని ట్రాక్ చేసి పట్టుకున్నారు.. నిందితులు హేమవరుణ్, పద్మలు నెహ్రునగర్ కు చెందిన వారిగా గుర్తించారు.. హేమవరుణ్ గతంలో జీజీహెచ్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేశారని చెబుతున్నారు.. ఇక, ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన…
గుంటూరు.. జీజీహెచ్లో మూడు రోజుల శిశువు అపహరణకు గురైన ఘటన కలకలం సృష్టిస్తోంది… ఈ నెల 12న కాన్పుకోసం పెదకాకానికి చెందిన ప్రియాంక అనే గర్భిణి చేరారు.. 13వ తేదీన మగ శిశువుకు జన్మనించారు.. అయితే, శుక్రవారం రాత్రి పసివాడు ఏడుస్తుండడంతో బయటకు తీసుకెళ్లింది.. ఆ శిశువు నాయనమ్మ… ఇక, బాత్రూంకు వెళ్తూ అక్కడే నిద్రపోతున్న అమ్మమ్మ పార్వతమ్మ పక్కన శిశువును వదిలి వెళ్లింది నాయనమ్మ.. కానీ, ఐదు నిమిషాల్లోనే తిరిగి వచ్చే సరికి శిశువును అపహరణకు…
ఆ జిల్లాలో వైసీపీ, టీడీపీల మధ్య నలిగిపోతున్నారు అధికారులు. ఏ పని చేస్తే ఎవరు విరుచుకుపడతారో తెలియక ఆందోళన చెందుతున్నారట. ఈ టెన్షన్ అంతా ఒక సర్టిఫికెట్ కోసం. దానిపైనే పెద్ద పొలిటికల్ ఫైటే జరుగుతోంది. రాజకీయం రసవత్తరంగా మారుతోంది. దుగ్గిరాలలో క్యాస్ట్ సర్టిఫికెట్ రగడ..! కరవమంటే కప్పకి కోపం.. విడవమంటే పాముకి కోపం. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల పొలిటికల్ పంచాయితీకి ఈ సామెత చక్కగా సరిపోతుంది. దుగ్గిరాల మండల పరిషత్ ఎన్నిక కోసం…