గుంటూరు జిల్లాలో మంత్రులు కన్నబాబు, మేకతోటి సుచరిత పర్యటించారు. ప్రత్తిపాడు మండలం కొండెపాడులో నల్లతామర పురుగుతో దెబ్బతిన్న మిర్చి పొలాలను పరిశీలించారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, హోంమంత్రి సుచరిత. మిరప తోటలను పరిశీలించాం. ఏదో ఒక సమస్య రైతులను పీడిస్తోంది. గుంటూరు జిల్లాలోనే లక్షా ఆరు వేల హెక్టార్లలో మిర్చి సాగవుతుంది. తామర పురుగు ఇతర దేశాల నుండి వచ్చి మన మిరపపై దాడి చేసింది.దీనికి సంబంధించి మన శాస్త్రవేత్తలు నివేదిక ఇచ్చారన్నారు మంత్రి కన్నబాబు.…
నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా అఖండ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని నమోదు చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సినిమా విడుదలయినప్పటి నుంచి పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. తన నటనతో మరోసారి బాలకృష్ణ అంటే ఏంటో చూపించారు. కరోనా, ఓటీటీల కారణంగా థియేటర్లకు జనాలు వస్తారో రారో అన్న అనుమానం ప్రొడ్యూసర్లలో ఉండేది. కానీ బాలయ్య ఒక్క సినిమాతో ఆ అనుమానాన్ని పటా పంచలు చేశారు.…
కేజీహెచ్ లో సమ్మెబాట పట్టారు జూడాలు. గుంటూరులో డాక్టర్ పై దాడికి నిరసనగా విధులు బహిష్కరించి ఆందోళనకు దిగ్గారు. కరోనా కష్ట కాలంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న మా పై దాడులు చేయడం దారుణం అంటూ తెలిపారు. మా సేవలను గుర్తించక పోయినా పర్లేదు కానీ దాడులు చేయడం ఘోరం. మా ప్రాణాలను ఫణంగా పెట్టి ఎంతోమంది ప్రాణాలను కాపాడాం. కానీ ఇప్పుడు వరసగ వైద్యుల పై దాడులు పెరిగిపోతున్నాయి. మాకు రక్షణ లేకుండా పోయింది, మాకు…
గుంటూరు నగరంలో చైన్ స్నాచింగ్‌ల ముఠా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ముఠాపై ప్రత్యేక నిఘా పెట్టింది పోలీస్ శాఖ. గుంటూరులో వరుస చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల్ని గుట్టురట్టు చేశారు పోలీసుల వారిని అరెస్ట్ చేశారు. 90 ఏళ్ళ ఓ వృద్ధురాలు మెడలో గొలుసు లాక్కొని పరారీ అయ్యాడో నిందితుడు. ముద్దాయిపై గతంలో 8 కేసులు ఉన్నాయి. దొంగిలించిన చైన్ ను లాడ్జి లాకర్ లో భద్రపరిచాడు నిందితుడు.…
గుంటూరు జిల్లాలోని నగర పాలెం పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ ను అమ్ముతున్న నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్‌తో సంబంధం ఉన్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు మాట్లాడుతూ .. మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రధాన నిందితుడు రేవంత్‌గా గుర్తించామని, రేవంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. పట్టుబడ్డ నిందితులు ఇంజనీరింగ్ విద్యార్థులుగా విచారణలో తేలిందన్నారు. నిందితుల దగ్గరనుంచి 150 గ్రాముల గంజాయి. మూడు సెల్ ఫోన్స్ స్వాధీనం…
ఈజీమనీ కోసం దారుణమయిన మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్ళు. నమ్మితే చాలు నట్టేటముంచుతున్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో చెంబుకి అతీతశక్తులు ఉన్నాయని మోసం చేస్తున్న రైస్ పుల్లింగ్ ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. వారి గుట్టును రట్టుచేశారు. చెంబుకి కెమికల్స్ అద్ది బియ్యాన్ని ఆకర్షించేలా చేసింది రైస్ పుల్లింగ్ ముఠా. దీనిని నమ్మేశారు అమాయక జనం. యూట్యూబ్ లో చూసి మోసాన్ని ఎలా చేయాలో నేర్చుకుంది ముఠా. గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి ముఠాను కాంటాక్ట్ చేశారు. అంతే…
గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం తుమ్మలచెరువులో దారుణం జరిగింది. సైదా అనే టీడీపీ కార్యకర్తపై ప్రత్యర్ధులు దాడికి పాల్పడ్డారు. బైక్ పై వెళ్లి వస్తుండగా అడ్డగించి రాళ్ళతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ సైదాని ఆస్పత్రికి తరలించారు.
సినిమా థియేటర్ ఓనర్లతో మంత్రి పేర్ని నాని సమావేశం కానున్నారు. థియేటర్ల రేట్లు, ఆన్లైన్ విధానంపై మంత్రి వారితో చర్చించనున్నారు. ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానంపై థియేటర్ యజమానుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సినిమా థియేటర్ ఓనర్లతో మంత్రి సమావేశమై థియేటర్ల ఓపెన్, ప్రస్తుత విధానం నుంచి ఆన్ లైన్ విధానానికి మారే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఆన్లైన్ టిక్కెటింగ్ విధానం కోసం రూపొందించే…
గుంటూరులోని స్వరూపనందేంద్ర సరస్వతి స్వామీ జన్మదినం సందర్భంగా ఫీవర్ ఆసుపత్రిలో రోగులకు హోంమంత్రి సుచరిత పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. నిబంధనలకు లోబడి అమరావతి రైతులు పాదయాత్ర చేయాలన్నారు. స్వామీ వారి విశిష్ట సేవలు దేశవ్యాప్తంగా అందుతున్నాయన్నారు. వేద పాఠశాలలో అనేక మంది విద్యార్థులు చదువుతూ సమాజ సేవ చేస్తున్నారన్నారు. స్వామీ వారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకుండాలని ఆమె కోరుకున్నారు. పాదయాత్ర చేస్తూనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నిబం ధనల ఉల్లంఘన జరిగితే…