రఘురామకృష్ణరాజు విడుదలపై పెద్ద వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గుంటూరు అర్బన్ ఎస్పీకి కోర్టు ధిక్కార నోటీసులు పంపారు రఘురామకృష్ణరాజు న్యాయవాది దుర్గాప్రసాద్. రఘురామ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే తీసుకురావాలని ఎస్కార్ట్‌ను ఆదేశించినట్లు సమాచారం అందుతోంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రఘురామ బెయిల్ పై విడుదలైనట్లేనని..విడుదలైన 10 రోజులకు బాండ్లను కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని న్యాయవాది దుర్గాప్రసాద్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రఘురామను తీసుకురావాలని ఎస్కార్ట్ ను పంపడం కోర్టు ఆదేశాలను…
నా భర్తకు ప్రాణహాని ఉందని ఆరోపించారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు భార్య రమ.. మీడియాకు ఓ వీడియోను విడుదల చేసిన ఆమె.. నా భర్తకు ఏం జరిగినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్, సీఐడీ బాధ్యత వహించాలన్నారు.. ఈ రాత్రి జైలులో ఆయనపై దాడి చేస్తారనే సమాచారం ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేసిన ఆమె.. వైసీపీ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని పేర్కొన్నారు.. ఇక, సీఐడీ ఆఫీసులో పోలీసులు తన భర్తను చిత్రహింసలకు గురిచేశారని…
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం క్షణ క్షణం ఉత్కంఠ రేపుతూనే ఉంది.. నన్ను తీవ్రంగా కొట్టారంటూ కోర్టుకు తెలిపారు రఘురామ.. దీనిపై మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది హైకోర్టు.. అయితే, దీనిపై ఇవాళ విచారణ సందర్భంగా.. జీజీహెచ్ ఇచ్చిన మెడికల్ రిపోర్టును చదివి వినిపించింది డివిజన్ బెంచ్.. రఘురామ కాలి పై గాయాలు ఏమీ లేవని స్పష్టం చేసింది మెడికల్ రిపోర్టు.. అవన్నీ తాజా గాయాలు కావని పేర్కొంది. రఘురామ పూర్తి ఆరోగ్యంగా…
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఎందుకు జైలుకు తరలించారని సీఐడీని ప్రశ్నించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. రఘురామ కృష్ణంరాజు కేసులో హైకోర్టులో ప్రారంభమైన వాదనలు కాసేపటి క్రితమే ముగిశాయి.. రఘురామ కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితిపై జిల్లా కోర్టు నుంచి వైద్య బృందం నివేదిక హైకోర్టుకు చేరింది.. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింగి.. ఈ సందర్భంగా జరిగిన పరిణామాలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు రఘురామ తరపు న్యాయవాదులు.. ఇదే సమయంలో.. సీఐడీ కూడా అన్ని విషయాలను కోర్టుకు వివరించింది. హైకోర్టు…
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఏపీ సీఐడీ అధికారుల బృందం హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్‌హిల్స్‌లో ఉన్న రఘురామకృష్ణరాజు నివాసానికి చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత గుంటూరు సీఐడీ కార్యాలయానికి ఎంపీ రఘరామకృష్ణరాజును తరలించారు. ఆయన వస్తున్న సమయంలో గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు, భారీ గేట్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. మంగళగిరి, తాడేపల్లిలో పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతుండటంతో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఈరోజు అధికారులతో సమీక్షను నిర్వహించారు. మంగళగిరి పరిధిలో రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షాపులు తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా 15 రోజులపాటు నైట్ కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. బార్ అండ్…