గుంటూరు జిల్లాలోని పులిచింతల సమీపంలో ఆదివారం ఉదయం భూప్రకంపనలు వచ్చాయి. ఈరోజు ఉదయం 7:15 గంటల నుంచి 8:20 గంటల మధ్యలో మూడుసార్లు భూమి కంపించింది. భూకంపలేఖినిపై దీని తీవ్రత 2.3,2.7,3 గా నమోదయింది. పులిచింతలతో పాటుగా తెలంగాణలోని చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లోనూ, సూర్యపేటలోనూ స్వల్పంగా భూమి కంపించినట్టు ఎన్‌జీఆర్ఐ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిలోపల పొరల్లో వస్తున్న మార్పుల కారణంగా భూప్రకంపనలు కలుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. Read: “పాగల్” టైటిల్ వీడియో సాంగ్ రిలీజ్
అక్కడ టీడీపీకి అభిమానులు.. కార్యకర్తలు బాగానే ఉన్నారు. పార్టీని నడిపించే నాయకుడే కరువయ్యాడు. ఎవరికి బాధ్యతలు అప్పగించాలో అధినేతకు కూడా అంతు చిక్కడంలేదా .. లేక యథావిధిగా నానబెడుతున్నారా? నాయకుడు లేని పార్టీలో ఏం చెయ్యాలో కేడర్‌కు కూడా అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? శివరామ్‌కు బాధ్యతలు అప్పగింతపై బాబు డైలమా? గుంటూరు జిల్లా సత్తెనపల్లి టీడీపీ చుక్కాని లేని నావలా తయారైంది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య తర్వాత నియోజకవర్గంలోని…
గుంటూరు సిటీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావుపై కేసు నమోదు చేసింది సీబీఐ… పొగాకు కొనుగోలు కంపెనీ పేరిట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి రూ.45 కోట్ల రుణాలు తీసుకున్న వెంకట్రావు.. రూ.19 కోట్ల రుణాన్ని చెల్లించకుండా ఎగ్గొట్టినట్టు అభియోగాలున్నాయి… బ్యాంకు ఫిర్యాదుతో తాడిశెట్టి వెంకట్రావు, మురళీమోహన్‌పై కేసు నమోదు చేసింది సీబీఐ.. ఇక, తెలుగు రాష్ట్రాల్లో వెంకట్రావు ఆస్తులపై సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.. కాగా, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో..…
గుంటూరులో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడు జోష్ బాబు అరెస్ట్ చేశారు పోలీసులు. బాలిక తల్లిదండ్రులకు మీ అమ్మాయి న్యూడ్ వీడియోలు ఉన్నాయంటూ నిందితుడు బెదిరించాడు. బాలిక తల్లిదండ్రులు వద్ద నుంచి రూ.3.30 లక్షలు బెదిరించి తీసుకున్నాడు. నిందితుడు జోష్ బాబు ఇంజనీరింగ్ చదివి ఓ ఆసుపత్రిలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నారు. జోష్ వద్ద నుంచి గోల్డ్ చైన్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గుంటూరు సౌత్ డీఎస్పీ ప్రశాంతి…
ఇప్పుడు చేస్తున్న అవినీతికి కోర్టులు కూడా చాలవు అంటూ సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. గుంటూరు జిల్లా చింతలపూడి వెళ్లిన ఆయన.. సంగం డెయిరీ కేసులో అరెస్టై.. జైలుకి వెళ్లొచ్చిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను పరామర్శించారు.. పార్టీ పూర్తి అండగా ఉంటుందని చెప్పారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన టీడీపీ అధినేత.. రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నరేంద్రది.. ఆయన తండ్రి నుండి ఇక్కడి ప్రజలకు, సంగండైరీ రైతాంగానికి…
గుంటూరు గ్యాంగ్ రేప్ కేసు మరో మలుపు తిరిగింది. ప్రధాన నిందితుడు కృష్ణ తల్లి మల్లీశ్వరి పరారైంది. నిన్న సాయంత్రం ఇంటికి తాళం వేసి.. ఇద్దరు పిల్లలతోపాటు వెళ్లిపోయినట్టు సమాచారం. కృష్ణ ఆదేశాలతోనే తల్లి మల్లీశ్వరి పరారైనట్టు పోలీసులు భావిస్తున్నారు. నంబర్ ప్లేట్లు లేని రెండు బైకులపై నిన్న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లినట్టు స్థానికులు చెప్తున్నారు. మరో నిందితుడు వెంకటరెడ్డి తల్లి, చెల్లి, భార్యను… ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు అయితే ఆరు రోజులు గడుస్తున్నా… కృష్ణ,…
గుంటూరు జిల్లాలో వైసీపీ-టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అమరావతి మండలంలోని ఉంగుటూరు గ్రామంలో గల చెరువు మరమ్మతుల విషయంలో వివాదం చెలరేగింది. దీంతో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. సర్పంచ్ భర్త సోమశేఖర్‌పై వైసీపీకి చెందిన రాయపాటి శివ వర్గం కర్రలతో దాడి చేసింది. సోమశేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం ఉంగుటూరులో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
భారీగా గుట్కా, ఖైనీ నిల్వలు స్వాధీనం చేసుకున్నారు గుంటూరు రూరల్ పోలీసులు. 97లక్షల 72వేల విలువైన గుట్కా నిల్వలను పట్టుకున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఆరుగురి నిందితులను అరెస్టు చేసారు. వారం రోజులుగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు పోలీసులు. ఈ గుట్కా ర్యాకెట్ కేసు వివరాలను వెల్లడించిన రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ… బెంగళూరుకు చెందిన తయారీదారు సిద్ధప్ప గుట్కా ర్యాకెట్లో కీలక పాత్రధారిగా గుర్తించాం అన్నారు. ఇక్కడ నుంచి రాష్ట్రంలో 8 జిల్లాల్లోకి గుట్కా…
గుంటూరు జిల్లా రొంపిచర్లలో విషాదం చోటుచేసుకుంది. భార్య వేధింపులు తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అంతేకాదు నా చావుకు భార్యే కారణం అని లేఖ రాసి ఇంట్లో భర్త ఉరేసుకున్నాడు. రొంపిచర్లకు చెందిన ఏలికా రామకృష్ణారావు(32)కు ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన యువతితో వివాహమయ్యింది. తరచూ దంపతుల మధ్య గొడవలు జరగడంతో భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో ఈపూరు స్టేషన్ లో భర్త, అతని బంధువులమీద కేసు పెట్టింది. ఈ క్రమంలో…