లైంగిక వేధింపుల ఘటనలపై మహిళా కమిషన్ ఫోన్ ద్వారా కేసు పూర్వ పరాలను తెలుసుకుని బాధితులకు న్యాయం జరిగేలా ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జిల్లాలో వరుస ఘటనలపై పోలీసు అధికారులతో మాట్లాడిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వారికి పలు సూచనలు చేశారు. గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్లలో వివాహితపై వాలంటీర్ దాష్టీకంపై సీరియస్ అయ్యారు.
పోలీసు అధికారులతో మాట్లాడిన కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. కేసు పూర్వాపరాలు విచారించి…వాలంటీర్ పై యాక్షన్ తీసుకోవాలని బాధిత మహిళకు వెంటనే న్యాయం జరిగేలా చూడాలని పోలీసులకు సూచించారు. గుంటూరు రాజీవ్‌గాంధీ నగర్ లో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటనపై మహిళా కమిషన్ ఆరా తీశారు. ఈ ఘటునకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
ఘటనకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. సత్తెనపల్లి ఉర్దూ పాఠశాల టీచర్, చిత్తూరు జిల్లా పీలేరు మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అరాచక పర్వంపై చర్యలు తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ ఆదేశాలు జారీ చేశారు. ఏలూరు సబ్ రిజిస్టర్ లైంగిక వేధింపుల పై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. డీఐజీతో మాట్లాడిన కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఫోన్ ద్వారా తెలుసుకున్నారు.