రేపు మిర్చి యార్డ్ అధికారులతో, ట్రేడర్స్ తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు.. ఈ ఏడాది మిర్చి ధరల పతనంతో తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం... ఐదు లక్షల ఎకరాల్లో ఈ ఏడాది మిర్చి సాగైనట్టు అంచనాలు ఉండగా.. 12 లక్షల మెట్రిక్ టన్నుల్లో.. ఇప్పటికే నాలుగు లక్షల మెట్రిక్ టన్నులను వ్యాపార వర్గాలు కొనుగోలు చేశాయి.
వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు గుంటూరులో పోలీసులు.. ఈ రోజు గుంటూరు మిర్చి యార్డ్‌లో వైఎస్ జగన్ పర్యటించిన విషయం విదితమే కాగా.. ఈ పర్యటన నేపథ్యంలో వైఎస్ జగన్ సహా 8 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు..
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో మరోసారి బయటపడింది. జగన్‌కు జెడ్‌ఫ్లస్ కేటగిరీ భద్రత ఉన్నా.. ఆయనకు పోలీసులు కనీస భద్రత కూడా కల్పించలేదు. వైఎస్ జగన్ గుంటూరు పర్యటన నేపథ్యంలో దారిలో ఎక్కడా పోలీసులు పెద్దగా కనబడలేదు. పెద్దగా భద్రత లేకుండానే గుంటూరు మిర్చి యార్డ్‌లో రైతులతో జగన్ సమావేశం అయ్యారు. తన భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఎం చంద్రబాబు నాయుడుపై జగన్…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని, ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. రైతుల దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని ధ్వజమెత్తారు. తమ హయాంలో వ్యవసాయం ఓ పండగలా మారిందని, రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించామన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. నేడు గుంటూరు మిర్చి యార్డ్‌కు జగన్ వచ్చారు. మిర్చి రైతుల…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు చేరుకున్నారు. సౌత్ బైపాస్ వద్ద జగన్‌కు వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. సౌత్ బైపాస్ నుంచి ర్యాలీగా గుంటూరు మిర్చి యార్డ్‌కు వైసీపీ అధినేత చేరుకున్నారు. జగన్ రాక నేపథ్యంలో వైసీపీ పార్టీ శ్రేణులు, మద్దతుదారులు, రైతులు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. కాసేపట్లో మిర్చి రైతులతో మాజీ సీఎం జగన్ మాట్లాడనున్నారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోనున్నారు. ఏపీలో కూటమి పాలనలో గిట్టుబాటు ధర…
మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గంట ముందే గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ముందుగా ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి గుంటూరు మిర్చి యార్డ్‌కు బయలుదేరేందుకు షెడ్యూల్ ఖరారు కాగా.. తాజాగా ఓ గంట ముందే (9 గంటలకు) వెళ్లేలా షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. ఉదయం 10 గంటలకు మిర్చి యార్డ్‌కు వద్దకు చేరుకుని.. గిట్టుబాటు ధర రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మిర్చి రైతులతో జగన్…
మిర్చి రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో మిర్చి యార్డులోని అన్ని వ్యవస్థలను నాశనం చేశారని, రానున్న మూడు మాసాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేసే విధంగా కార్యచరణ రూపొందించాం అని చెప్పారు. మిర్చి యార్డులోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. గుంటూరు మిర్చి యార్డు ఆసియాలోని అతిపెద్ద మిర్చి యార్డుగా రైతులకు సేవలు అందిస్తుందని మంత్రి…
గుంటూరు మిర్చి యార్డ్ లో ఇసుక వేస్తే రాలనీ పరిస్థితి తలెత్తింది ..గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, కర్ణాటక, తెలంగాణ, లాంటి ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో వస్తున్న మిర్చి టిక్కీల వాహనాలతో మార్కెట్ యార్డ్ నిండిపోయింది ….దీంతో ఎగుమతి దారులు సరుకును తరలించలేక పోవడం, మరో వైపు వస్తున్న సరుకును ఆపలేని పరిస్థితిలో పాలకవర్గం ఉండటంతో, మిర్చి రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు… దీనికి తోడు పెద్ద ఎత్తున వస్తున్న మిర్చి దెబ్బకు వ్యాపారులు…