Bull Attacked On GVL Narasimha Rao In Guntur Mirchi Yard: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావుకి తృటిలో ప్రమాదం తప్పింది. గుంటూరులోని మిర్చి యార్డులో ఆయన్ను కుమ్మేసేందుకు ప్రయత్నించింది. కట్టేసి ఉన్న ఆవుని తాకిన జీవీఎల్‌ను.. వెనుక కాలితో దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే.. అది కట్టేసి ఉండటంతో జీవీఎల్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. తన చుట్టూ జనం ఉండటంతో ఆ ఆవు కంగారు పడి ఉంటుందని, ఈ క్రమంలోనే జీవీఎల్ తాకినప్పుడు అది దాడి చేసి ఉంటుందని అంటున్నారు. ముందు వైపు నుండి కూడా ఆ ఆవు దాడి చేసేందుకు యత్నించింది.
Throat Cut: నార్సింగీ లో దారుణం.. గొంతుకోసి హత్య
అంతకుముందు.. వైసీపీ, టీడీపీలపై జీవీఎల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీతో తమకు రాజ్యాంగబద్ధ సంబంధాలే ఉన్నాయని.. భవిష్యత్తులో వైసీపీకి బీజేపీ, జనసేన పార్టీలే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. టీడీపీ కనిపించకుండా పోతుందని జోస్యం చెప్పారు. పోలవరం మాదంటే మాదని వైసీపీ, టీడీపీలు ప్రగల్భాలు పలుకుతున్నాయన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. విశాఖలో భూములు దోపిడికి గురవుతున్నాయని పేర్కొన్న ఆయన.. ఈ అంశంపై చర్చించేందుకు అధికార, ప్రతిపక్షాలు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రలోని రిజర్వాయర్లకు కనీసం మరమ్మత్తులు కూడా జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mandous Cyclone Live Updates: మాండూస్ విలయం.. లైవ్ అప్‌డేట్స్
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్ట్‌లు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని జీవీఎల్ కోరారు. తాను పుట్టిన రాయలసీమకు, ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు చంద్రబాబు ఎలాంటి మేలు చేయలేదన్నారు. పోలవరంలో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలన్నారు. ఇక వచ్చే ఏడాదికి విశాఖకు 5జీ సేవలు అందిస్తామని.. అలాగే వైజాగ్ నుంచి తిరుపతి, హైదరాబాద్, బెంగళూరుకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తెస్తామని జీవీఎల్ పేర్కొన్నారు.