గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పాలకులు గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోయినా చోద్యం చూస్తూ కూర్చున్నారు.. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుండ్లకమ్మ ప్రాజెక్టుకు ఎనిమిదిన్నర కోట్ల రూపాయాల నిధులు కేటాయించి.. గేట్లు మరమ్మత్తులు చేపడుతున్నాం అన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్..
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం కందుల ఓబుల్ రెడ్డి ప్రాజెక్టు (గుండ్లకమ్మ రిజర్వాయర్)కు చెందిన మరో గేటు కొట్టుకుపోయింది.. గతంలో కొట్టుకుపోయిన 3వ గేటు మరమ్మతులు ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో చేయలేదనే విమర్శలు వినిపిస్తుండగా.. శుక్రవారం రాత్రి రెండో గేటు అడుగు భాగం కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే.
గుండ్లకమ్మ ప్రాజెక్ట్ నిర్వహణ తీరు సక్రమంగా లేదని మండిపడ్డారు అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్.. రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టుల భద్రతపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్న ఆయన.. ప్రాజెక్టుల భద్రత ఆందోళన కలిగిస్తుందన్నారు. గత ఏడాదిలో గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేటు, అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకోపోయినా వాటిని ఇంతవరకు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవడం శోచనీయం అన్నారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల్లో గేట్లు రిపేర్లలో ఉన్న మాట వాస్తవం అన్నారు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు… అయితే, ఇవన్నీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏమి జరగలేదన్నారు.. సీఎం జగన్ పై అనవసర ఆరోపణలు చేసి లబ్ధిపొందాలని చూస్తే ఉపయోగం లేదని.. అన్నీ డ్యామ్‌ల సేఫ్టీ పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు… ఇక, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కూరుకుపోవడం వల్ల 700 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్లాయి.. నీటి…