Gottipati Ravi Kumar: గుండ్లకమ్మ ప్రాజెక్ట్ నిర్వహణ తీరు సక్రమంగా లేదని మండిపడ్డారు అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్.. రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టుల భద్రతపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్న ఆయన.. ప్రాజెక్టుల భద్రత ఆందోళన కలిగిస్తుందన్నారు. గత ఏడాదిలో గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేటు, అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకోపోయినా వాటిని ఇంతవరకు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవడం శోచనీయం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసింది నాణ్యత లేని మధ్యం అమ్మడం, ఇసుక అక్రమ రవాణా ద్వారా దోచుకోవడం.. ఇసుక అక్రమ రవాణా ద్వారా వైసీపీ నేతలు వెయ్యి కోట్లు దోచుకున్నారని ఆరోపణలు గుప్పించారు. బాపట్ల జిల్లాలో భారీ ఎత్తున వర్షాలు సంభవించగా రైతులకు తీవ్ర నష్టం జరిగినా ఆడుకోవటంలో ప్రభుత్వం విఫలం అయ్యిందన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకునే వరకు టీడీపీ పోరాటం చేస్తుందన్నారు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్.
Read Also: Rajasthan CM Candidate: రాజస్థాన్‌లో ఈ రోజే బీజేపీ సమావేశం.. సీఎం పదవిపై వీడని ఉత్కంఠ
కాగా, గుండ్లకమ్మ ప్రాజెక్టులో 6, 7, 14వ గేట్లను పూర్తిగా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు నీటిపారుదల శాఖ అధికారులు.. వరద నీటి ఉధృతికి మిగతా గేట్లు కూడా కొట్టుకుపోయే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తగా నిర్ణయం తీసుకున్నారు అధికారులు.. రాత్రి నీటి ఉదృతికి కొట్టుకుపోయింది 2వ నంబర్ గేటు.. కొట్టుకపోయిన రెండవగేటుతో పాటు 6, 7, 14 మొత్తం నాలుగు గేట్ల ద్వారా భారీగా దిగువ ప్రాంతానికి కాలువల ద్వారా సముద్రంలోకి నీరు వృథాగా పోతుంది. ఇక, మల్లవరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది దూకుడు వాగు.. బ్రిడ్జిపై నుంచి 7 అడుగుల మేరా నీటి ప్రవాహం ఉండడంతో.. మల్లవరం వైపు నుండి గుండ్లకమ్మ ప్రాజెక్టు వైపు పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.. ప్రాజెక్టు గేట్ల పరిస్థితిని పరిశీలించేందుకు గుండ్లకమ్మ ప్రాజెక్టు మల్లవరం వద్దకు చేరుకున్నారు జిల్లా టీడీపీ నేతలు..