మునుగోడు మండలంలో కాల్పుల కలకలం రేగింది. ఓ యువకుడు బైక్ పై వెలుతుండగా కొందరు దుండగులు అతని పై కాల్పులకు తెగబడ్డారు. బాధితుడికి తీవ్రగాయాలవడంతో.. హుటా హుటిన సమీపంలోని నార్కెట్‌పల్లి ఆసుప్రతికి తరలించారు. స్థానిక సమాచారంతో..పోలీసులు అక్కడ చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామానికి చెందిన నిమ్మల లింగస్వామి మునుగోడులో కూల్‌డ్రింక్స్, నీటి బాటిళ్లను విక్రయిస్తూ.. దీంతో పాటు రియల్ ఎస్టేట్…
టాలీవుడ్ నటుడు రణధీర్‌రెడ్డిని గన్‌తో బెదిరించారు భూ కబ్జాదారులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా పూడూరులో తుపాకీ కలకలం రేపింది. నటుడు రణధీర్‌రెడ్డిని తుపాకీతో భూ కజ్జాదారులు బెదిరించారు. హిమాంపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 13 నుంచి 19 వరకు ఇరవై ఎనిమిది ఎకరాలు భూమి కొనుగోలు చేశారు రణధీర్‌రెడ్డి. అయితే, భూమి చదును పనులు చేయిస్తుండగా, హైదరాబాద్‌కు చెందిన సుల్తాన్ హైమత్ ఖాన్ అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు.. గన్‌లోడ్ చేసి చంపుతానంటూ రణధీర్‌రెడ్డిని…
చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎంతో భవిష్యత్తు వున్న యువత బలవన్మరణాలను ఆశ్రయిస్తున్నారు. కాకినాడ జిల్లాలో గన్ తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ ఐ గోపాల కృష్ణ గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న సీఎం బందోబస్తు కి వెళ్ళి వచ్చిన ఎస్ ఐ గోపాలకృష్ణ రాత్రి ఇంట్లో గన్ తో కాల్చుకున్నాడు. గోపాలకృష్ణది విజయవాడ దగ్గర…
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి లో జరిగిన కాల్పుల ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులకు ఉపయోగించిన గన్ ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన నెల్లూరు జిల్లా కాల్పుల ఘటనలో నిందితుడు సురేష్ రెడ్డికి గన్ ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు. గతంలో ఎలాంటి నేర చరిత్ర లేని సురేష్ రెడ్డి ఇంతటి దారుణానికి ఒడి గట్టడం వెనుక ఎవరిదైనా ప్రోత్సాహం..ఉందా…
అదో గ్రేట్ రాబరీ. తుపాకీతో బెదిరించి బ్యాంక్ దోచేశాడో దుండగుడు. పట్టపగలు… రెండంటే రెండే నిముషాల్లో… అంతా సినీ ఫక్కీలో జరిగింది. చోరీలో పోయిన సొత్తు కంటే రాబరీ యాక్షన్ ప్లాన్ పోలీసులను అవాక్కయ్యేలా చేసింది. ఇది ముఠా పనా…!?. మారణాయుధాలతో తిరుగుతూ బ్యాంకులను టార్గెట్ ట్ చేస్తున్నాయా..!?. ఎన్నో అనుమానాలు. దీంతో కేసులో మిష్టరీని చేధించేందుకు స్పెషల్ టీంలు రంగంలోకి దిగాయి. శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయం..!!. అనకాపల్లి జిల్లా కాశింకోట మండలం నర్సింగబిల్లిలోని…
ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ దొంగలు కలకలం సృష్టించారు.. పట్టపగలే బ్యాంకులోకి దూరి.. తుపాకీతో బెదిరించి అందినకాడికి ఎత్తుకెళ్లారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఓ బ్యాంకులో లూఠీ జరిగింది.. అనకాపల్లిలోని నర్సింగబిల్లి గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో ఈ ఘటన జరిగింది.. బ్యాంకులోకి ప్రవేశించిన దొంగలు.. బ్యాంకు సిబ్బందిని తుపాకీతో బెదిరించి అందినకాడికి నగదు ఎత్తుకెళ్లారు. ఇక, బ్యాంకు సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అనకాపల్లి పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బ్యాంకులోని సీసీ…
కడప జిల్లా పులివెందుల మండలంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. పులివెందుల మండలంలోని నల్లపురెడ్డిపల్లెకు చెందిన పార్థసారథి రెడ్డిపై పులివెందుల ఎంపీపీ శివప్రసాద్ రెడ్డి కాల్పులు జరిపారు. కాల్పుల్లో పార్థసారథిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. పార్థసారథి రెడ్డి మరణించాడనే భయంతో ఆత్మహత్య చేసుకుని ఎంపీపీ శివ ప్రసాద్ మరణించారు.అయితే ఈ ఘటనకు పాత కక్షలే కారణమని తెలుస్తోంది. ఆస్తి తగాదాలే ఈ ఘటనకు కారణమని.. వాళ్ళు ఇద్దరు బంధువులే అని స్థానికులు అంటున్నారు. కాగా విషయం తెలిసిన…