చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎంతో భవిష్యత్తు వున్న యువత బలవన్మరణాలను ఆశ్రయిస్తున్నారు. కాకినాడ జిల్లాలో గన్ తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ ఐ గోపాల కృష్ణ గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
నిన్న సీఎం బందోబస్తు కి వెళ్ళి వచ్చిన ఎస్ ఐ గోపాలకృష్ణ రాత్రి ఇంట్లో గన్ తో కాల్చుకున్నాడు. గోపాలకృష్ణది విజయవాడ దగ్గర జగ్గయ్య చెరువు సొంత ఊరు. 2014 సంవత్సరం బ్యాచ్ లో ఎస్ఐగా సెలక్ట్ అయ్యారు. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకు గదిలో పిల్లలు, భార్య నిద్రిస్తుండగా హాల్లో గన్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం విషాదం నింపింది. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఏమై వుంటాయా అని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.గతంలో కాకినాడలో ట్రాఫిక్ లో పని చేశారు గోపాల కృష్ణ. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సై ఇంటికి చేరుకుంటున్నారు పోలీసులు. కాకినాడ జీ జీ హెచ్ కి ఎస్సై గోపాలకృష్ణ మృతదేహం తరలించారు. ఎస్పీ రవీంద్రనాధ్ బాబు జీ జీ హెచ్ కి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
గోపాలకృష్జ భార్య పేరు పావని. పెళ్లి అయ్యి ఐదు ఏళ్ళు అవుతుంది. ఇద్దరు పిల్లలు.. పాప వయస్సు 3 ఏళ్ళు, బాబు వయస్సు ఏడాది.
ఏడాది క్రితం ట్రాఫిక్ నుంచి లా అండ్ ఆర్డర్ ఎస్సై గా బదిలీ అయ్యారు గోపాల కృష్ణ. మార్చురీ, ఇంటి దగ్గర భారీ పోలీస్ బందో బస్తు ఏర్పాటుచేశారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. ఇంట్లోనే ఉన్నారు భార్య, బంధువులు.
విమానం కూలి…
మరోవైపు ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం సంభవించింది. రాయ్పుర్ ఎయిర్పోర్ట్లో ప్రభుత్వ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయిందని రాయ్పుర్ విమానాశ్రయ డైరెక్టర్ రాకేశ్ సహాయ్ వెల్లడించారు. రన్వే చివర్లో ప్రమాదానికి గురైందని చెప్పారు. పైలెట్లకు ఈ విమానం ద్వారా శిక్షణ ఇస్తుంటారు. విమానంలో సాంకేతిక లోపం వల్ల ప్రమాదానికి కారణమని ప్రాథమిక సమాచారం.ఈ ప్రమాదంలో కెప్టెన్ గోపాల్ కృష్ణ పాండా, కెప్టెన్ ఏపీ శ్రీవాస్తవలు మృతి చెందారు. పైలెట్ల మృతి పట్ల ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
CRDA: ఈ-వేలం ద్వారా అమరావతి టౌన్ షిప్ స్థలాల అమ్మకం