Gun Firing: మునుగోడులో కాల్పల కలకలం..! బైక్ పై వెళుతున్న వ్యక్తిపై ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు మండలంలో కాల్పుల కలకలం రేగింది. ఓ యువకుడు బైక్ పై వెలుతుండగా కొందరు దుండగులు అతని పై కాల్పులకు తెగబడ్డారు. బాధితుడికి తీవ్రగాయాలవడంతో.. హుటా హుటిన సమీపంలోని నార్కెట్‌పల్లి ఆసుప్రతికి తరలించారు. స్థానిక సమాచారంతో..పోలీసులు అక్కడ చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామానికి చెందిన నిమ్మల లింగస్వామి మునుగోడులో కూల్‌డ్రింక్స్, నీటి బాటిళ్లను విక్రయిస్తూ.. దీంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. రోజులాగే రాత్రి దుకాణం మూసేసి ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో మునుగోడు మండలం సింగారం శివారు దాటగానే కొందరు ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే.. లింగస్వామి చనిపోయినట్లు భావించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే అక్కడే స్వామి అనే వ్యక్తి ఈఘటనపై పోలీసులకు సమాచారం అందించాడు.
Also Read
- Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
- New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
- Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
read also: Common Wealth Games 2022: కామన్‌వెల్త్‌లో దూసుకెళ్తున్న భారత్.. 20 పతకాలు కైవసం
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితిలో వున్న బాధితులు లింగస్వామిను నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉన్నట్లుగా సమాచారం. అయితే.. ఘటన జరిగిన స్థలం వద్ద ఓ బుల్లెట్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని, నిందితుల కోసం గాలింపు చేపట్టామని నల్గొండ డీఎస్పీ నర్సింహరెడ్డి తెలిపారు. అయితే.. బాధితుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్వగ్రామమైన బ్రహ్మణవెల్లంల గ్రామానికి చెందిన లింగస్వామిగా గుర్తించారు. కామినేని ఆసుపత్రి వద్దకు వెళ్లి పరిశీలించారు. బాధితుడుతో మాట్లాడారు.. రియల్ ఎస్టేట్ వ్యాపారితో పాటు మరికొందరిపై అనుమానం ఉందని బాధితుడు డీఎస్పీకి తెలిపారని సమాచారం. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
తాజావార్తలు
-
RBI New FD Rules: FD నిబంధనల్లో కీలక మార్పులు.. వడ్డీపై ప్రభావం ఎంత..?
-
Shivaji: పుష్పలో ‘మంగళం శ్రీను’ రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
-
Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!