టాలీవుడ్ నటుడు రణధీర్‌రెడ్డిని గన్‌తో బెదిరించారు భూ కబ్జాదారులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా పూడూరులో తుపాకీ కలకలం రేపింది. నటుడు రణధీర్‌రెడ్డిని తుపాకీతో భూ కజ్జాదారులు బెదిరించారు. హిమాంపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 13 నుంచి 19 వరకు ఇరవై ఎనిమిది ఎకరాలు భూమి కొనుగోలు చేశారు రణధీర్‌రెడ్డి. అయితే, భూమి చదును పనులు చేయిస్తుండగా, హైదరాబాద్‌కు చెందిన సుల్తాన్ హైమత్ ఖాన్ అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు.. గన్‌లోడ్ చేసి చంపుతానంటూ రణధీర్‌రెడ్డిని బెదిరించాడు. దీంతో, వెంటనే డయల్ 100 కు పోన్ చేసి సమాచారం ఇవ్వడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. హైమత్ ఖాన్ దగ్గర గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, వికారాబాద్ కు చెందిన సుభాష్ రెడ్డి దగ్గర తాను భూమి కొనుగోలు చేశానని.. భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయనని రణధీర్‌రెడ్డి చెబుతున్నారు. అయితే, మొత్తంగా గన్‌తో బెదిరించిన ఈ ఘటన మాత్రం కలకలం సృష్టిస్తోంది.
Read Also: Telangana: మరో బాదుడుకు రంగం సిద్ధం..!