నోయిడాలోని రబుపురా పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివారం ఆయన తన భార్యతో వీడియో కాల్‌లో మాట్లాడుతుండగా గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మహ్మద్‌పూర్ గ్రామం సమీపంలో పోలీస్ స్టేషన్ జీపులో ప్రభుత్వ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు
యూపీ రాజధాని లక్నోలో ఓ వ్యాపారి తన రెండో భార్యను కలిసేందేకు వచ్చి గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. వ్యాపారవేత్త సతీష్ సోని పట్టపగలే కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఓ సిగ్నల్ వద్ద గన్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
యూపీ పోలీసుల ఓ సిగ్గుమాలిన చర్య వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సబ్-ఇన్‌స్పెక్టర్ ఒక మహిళను చెంపదెబ్బ కొట్టడం కనిపిస్తుంది. అంతేకాకుండా.. తన వద్ద ఉన్న పిస్టల్ తీసి భయపెట్టాడు. కాగా.. ఈ వీడియో వైరల్ కావడంతో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేసి దర్యాప్తుకు ఆదేశించారు.
బీహార్‌లో దారుణం జరిగింది. నర్సరీ విద్యార్థి స్కూల్‌లో తుపాకీతో హల్‌చల్ చేశాడు. ఓ విద్యార్థిపై కాల్పులకు తెగబడ్డాడు. చేతికి బుల్లెట్ తగలడంతో హుటాహుటినా పాఠశాల సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో స్కూల్ యాజమాన్యంతో షాక్‌కు గురైంది. సుపాల్ జిల్లాలోని సెయింట్ జోన్ బోర్డింగ్ స్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
సంగారెడ్డి జిల్లా బీడీఎల్ బానూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిఐఎస్ఎఫ్ జవాన్ వెంకటేశ్వర్లు గన్ మిస్ ఫైర్ అయ్యి దుర్మరణం చెందాడు. రాత్రి విధులకు వెళ్లి ఉదయం తిరిగి వస్తుండగా సీఐఎస్ఎఫ్ వాహనంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బీడీఎల్ బానూరు పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు నంద్యాల జిల్లా అవుకు మండలం జూనూతలకు చెందినవాసిగా తెలిపారు. గతంలో ప్రధాని మోడీ భద్రత టీమ్‌లో 2…
సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు యువత పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తూ కటకటాల పాలవుతున్నారు. ఇప్పుడు అంతా ఇన్‌స్టా రీల్స్ రోజులు. జీవితంలో జరిగే ప్రతి సంఘటనను అందులో పోస్టు చేయడం కామన్ గా మారింది.
భర్తతో విభేదాల కారణంగా కొడుకు తుపాకితో కాల్చిన తల్లి.. తానూ కాల్చుకుని చనిపోయింది. మెరికాలోని టెక్సాస్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లో కి వెళితే.. 32 ఏళ్ల సవన్నా క్రిగర్ కి తన భర్తతో విభేదాలు వచ్చాయి.
Kerala Student Open Fire in School: పాఠశాలలో తూపాకితో మాజీ విద్యార్థి కలకలం సృష్టించాడు. ఎయిర్ పిస్టల్‌తో స్కూల్‌కు వచ్చి బెదిరింపులు దిగిన మాజీ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లాలో వివేకోదయం బాయ్స్ హయ్యర్ సెకండరీ స్కూల్లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. త్రిసూర్‌లోని వివేకోదయం మాజీ విద్యార్థి జగన్ మంగళవారంఉదయం 10 గంటల సమయంలో పాఠశాలలోకి ప్రవేశించాడు. నేరుగా స్టాఫ్ రూంకు వెళ్లిన జగన్…