Man dies while dancing in Gujarat's Dahod: డాన్స్ చేస్తున్న మరో వ్యక్తి గుండె ఆగింది. ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు దేశంలో అక్కడక్కడ జరుగుతున్నాయి. అప్పటి వరకు సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న వ్యక్తులు ఒక్కసారిగా గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. తాజా మరోసారి ఇలాంటి ఘటనే పునరావృతం అయింది. గుజరాత్ రాష్ట్రంలోని దాహోద్ జిల్లాలో దేవ్‌గఢ్ బరియా ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది.
గుజరాత్‌పై మార్పు తుఫాన్ దూసుకుపోతోందని. తమ పార్టీ తదుపరి ప్రభుత్వా్న్ని ఏర్పాటు చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
Amul hikes price of milk by Rs 2 per litre: పండగ సీజన్ ముందు సామాన్యులకు షాకిచ్చే నిర్ణయం తీసుకుంది ప్రముఖ పాల ఉత్పత్తి సంస్థ అమూల్. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటి్ంగ్ ఫెడరేషన్ లిమిటెడ్ అమూల్ బ్రాండు పేరుతో దేశవ్యాప్తంగా పాలను విక్రయిస్తోంది. ప్రస్తుం ఈ సంస్థ లీటర్ పాల ధరను రూ.2 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఫుల్ క్రీమ్ మిల్క్ ధర లీటర్ కు రూ. 61 నుంచి 63కు పెరగనుంది.…
గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీని ఉద్దేశించి గతంలో ఆమ్ నేత గోపాల్ ఇటాలియా చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.
గుజరాత్‌లోని మెహసానా జిల్లాలోని మొధేరాను తొలి సంపూర్ణ సోలార్ గ్రామంగా ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు సూర్యదేవాలయం ఉన్న గ్రామంగా మొధేరా ప్రసిద్ధి చెందిందని.. ఇప్పటి నుంచి సూర్య గ్రామంగా పిలుస్తారని ప్రధాని మోడీ వెల్లడించారు.
PM Modi To Declare Modhera As India's 1st Solar-Powered Village: దేశంలో గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించే విధంగా అడుగులు పడుతున్నాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు కాలుష్యాన్ని నివారించేందుకు సోలార్ ఎనర్జీ, విద్యుత్ వాహనాలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. దీంతో పాటు ముడి చమురు దిగుమతిని తగ్గించుకుని, విదేశీమారక నిల్వలను పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉంటే దేశంలోనే తొలి సోలార్ గ్రామంగా గుజరాత్ రాష్ట్రంలో మోధేరా గ్రామం రికార్డులకెక్కనుంది. గుజరాత్ రాష్ట్రంలోని మోహసానా…
Gujarat: భారత్‌లో డ్రగ్స్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ధనార్జనే ధ్యేయంగా కోట్లలో వ్యాపారం చేస్తూ అక్రమార్కులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి ఇక్కడ పౌరులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే అధికారులు పటిష్ట నిఘా ఏర్పాటు చేసి.. కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అయినా వారి కళ్లు కప్పి డ్రగ్స్, మత్తుపదార్థాల అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. తాజాగా, గుజరాత్లో మరోసారి భారీగా డ్రగ్స్ ను…
మహారాష్ట్రలోని ముంబైలో భారీ మొత్తంలో డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన యాంటీ నార్కోటిక్స్ సెల్ (ANC) 50 కిలోల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకుంది.
Garba Dance:దేశ వ్యాప్తంగా దసరా నవరాత్రులను ప్రజలు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో కొందరు ఆకతాయిలు నవరాత్రుల సందర్భంగా గర్బా నృత్యం చేస్తున్న మహిళలపై రాళు రువ్వారు.