Arvind Kejriwal: ప్రధాని మోడీకి కేజ్రీవాల్ కౌంటర్.. ఉచితాలని చెప్పి సామాన్యుడిని అవమానించొద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: గుజరాత్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు చేస్తోన్న వాగ్దానాలపై పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. ఉచితాల నుంచి విముక్తి కల్పించాలని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. రాజకీయ నాయకులకు కూడా ఎన్నో ఉచితాలు అందుతున్నాయని గుర్తు చేశారు. కోటీశ్వరుల బ్యాంకు రుణాల మాటేమిటని ప్రశ్నించారు. పదే పదే ఉచితాలు రద్దు చేయాలంటు సామాన్యులను అవమానించవద్దని మండిపడ్డారు. ధరల పెరుగుదలతో బాధపడుతోన్న సామాన్య ప్రజలకు విద్య, వైద్యాన్ని ఉచితంగా ఎందుకు అందించకూడదని ప్రశ్నించారు. అవి ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఈమేరకు ఆయన ఆదివారం హిందీలో ట్వీట్ చేశారు.
Pm Modi At Ayodhya: అయోధ్యలో దీపావళి వేడుక
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో పీఎం ఆవాస్ యోజన కింద మంజూరైన ఇళ్ల గృహప్రవేశాలను శనివారం ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. దేశానికి ఉచితాల నుంచి విముక్తి కల్పించాలన్నారు. ఎంతో మంది పన్నుచెల్లింపుదారులు తనకు ఈవిషయంపై చాలా లేఖలు పంపారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోనూ షేర్ చేస్తూ ప్రధాని మోడీపై కేజ్రీవాల్ విమర్శనాస్త్రాలు సంధించారు.
लोग महंगाई से बहुत ज़्यादा परेशान हैं। जनता को मुफ़्त शिक्षा, मुफ़्त इलाज, मुफ़्त दवाइयाँ, बिजली क्यों नहीं मिलनी चाहिए? नेताओं को भी तो इतनी फ्री सुविधायें मिलती हैं। कितने अमीरों के बैंकों के क़र्ज़े माफ़ कर दिये। बार बार मुफ़्त रेवड़ी बोलकर जनता का अपमान मत कीजिए https://t.co/oWMa5p9KjF
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 23, 2022
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!