Elections: దేశంలో మళ్లీ ఎన్నికల సందడి మొదలు కానుంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఈ మధ్యాహ్నం మూడు గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నట్లు ఈసీ తెలిపింది.
గుజరాత్ అసెంబ్లీ పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 18తో ముగుస్తుంది, హిమాచల్ ప్రదేశ్ పదవీకాలం జనవరి 8తో ముగుస్తుంది. ఎన్నికల సన్నద్ధతను సమీక్షించేందుకు కమిషన్ అధికారులు ఇటీవల రెండు రాష్ట్రాలను సందర్శించారు. గుజరాత్ శాసనసభలో 182 స్థానాలు ఉన్నాయి, 92 మెజారిటీ మార్క్, 68 సీట్లున్న హిమాచల్ ప్రదేశ్ శాసనసభలో మెజారిటీ మార్క్ 35గా ఉంది. 2017 ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 44 సీట్లు, కాంగ్రెస్ 21 సీట్లు గెలుచుకోగా, గుజరాత్‌లో బీజేపీ 99, కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకున్నాయి.ప్రధాని నరేంద్ర మోదీ సహా అగ్రనేతల బ్యాక్ టు బ్యాక్ ర్యాలీలు, పర్యటనలు రానున్న రెండు రాష్ట్రాల్లో ఎన్నికలకు రంగం సిద్ధం చేశాయి. గుజరాత్‌లో బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నుంచి గట్టి సవాలును ఎదుర్కొంటోంది. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రానికి తరచుగా పర్యటనలు చేస్తూ తన ఎన్నికల వాగ్దానాలను ప్రకటిస్తున్నారు.
Bomb Threat: మాస్కో-ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు.. ఎయిర్‌పోర్ట్ హైఅలర్ట్
ఈ వారం ప్రారంభంలో గుజరాత్‌లో జరిగిన ర్యాలీ సందర్భంగహా బుధవారం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఇతర పక్షాలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అభివృద్ధిని ఆపిస్తోందని ఆరోపించారు. ప్రధాని మోదీ ఇటీవలి పర్యటనల్లో కోట్లాది రూపాయల ప్రాజెక్టులను ప్రారంభించారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్, 15 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్‌లో గత నెలలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హర్ష్ మహాజన్ బీజేపీలో చేరడంతో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆప్ గుజరాత్ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి అహర్నశలా కృషి చేస్తోంది. నిరుద్యోగ భృతి, రాష్ట్రంలో ఆరు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ ఏడాది ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఆప్ బరిలో నిలవనుంది.