Gujarat: గుజరాత్ రాష్ట్రంలో విషాదం నెలకొంది. బోతాద్ జిల్లాలోని కృష్ణసాగర్ లేక్‌లో పడి ఐదుగురు టీనేజర్లు శనివారం మృతి చెందారు. తొలుత నీళ్లల్లో దిగిన వారిని కాపాడేందుకు ప్రయత్నించిన బాలురు నీట మునిగిపోయారు. మృతులు అందరూ 16-17 ఏళ్ల వారేనని స్థానిక పోలీసులు తెలిపారు. ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు వారిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకపోయింది.
Read Also:Kondagattu: హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు.. మాలదారులతో కిటకిటలాడుతున్న ఆలయం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ లోని బోటాడ్ జిల్లాలోని ఓగ్రామానికి చెందిన 16-17 ఏళ్ల వయస్సు ఇద్దరు బాలులు కృష్ణసాగర్ సరస్సులో ఈత కొట్టేందుకు శనివారం మధ్యాహ్నం వెళ్లారు. అయితే నీటిలో దిగి ఈత కొడుతున్న సమయంలో ఇద్దరు బాలులు అందులో మునిగిపోయారు. దీనిని గమనించిన మరో ముగ్గురు పిల్లలు వారిని కాపాడాలనే ఉద్దేశంతో నీటిలో దూకారు. కానీ వారికి కూడా పెద్దగా ఈత రాకపోవడంతో ఆ ముగ్గురు కూడా నీటిలో మునిగిపోయారు. వీరి వయస్సు కూడా 17 సంవత్సరాల లోపే ఉంటుంది.
Read Also:Simran Kaur Mandi: బాత్ రూం నుంచి బయటికి వచ్చావా పిల్ల.. బట్టలు మర్చిపోయావ్
ఈ ఘటనపై పోలీసులకు సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో సమాచారం అందింది. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దాదాపు 45 నిమిషాల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. కానీ పిల్లలను కాపాడలేకపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్టు బోటాడ్ ఎస్పీ కిశోర్ బలోలియా మీడియాకు తెలిపారు.