ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారికి సూరత్ కోర్ట్ 2 ఏళ్ల జైల్ శిక్ష విధించడం షాక్ కు గురిచేసిందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో, రాష్ట్రంలో అక్కడ బీజేపీ.. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని మండిపడ్డారు.
Modi Surname Case: కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పు చెప్పింది. 2019లో ‘‘మోదీ ఇంటిపేరు’’ వ్యాఖ్యలపై పరువునష్టం కేసులో శిక్షను ఎదుర్కోనున్నారు. శిక్ష విధించిన తర్వాత సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి 30 రోజుల బెయిల్ మంజూరు చేసింది. తీర్పుపై అప్పీల్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అంతకుముందు రోజు సూరత్ కు వచ్చిన రాహుల్ గాంధీకి కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.
Supreme Court: 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులకు శిక్షను తగ్గించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించేందుకు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, జెబి పార్దివాలాలతో కూడిన ధర్మాసనం కొత్త బెంచ్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు బిల్సిస్ బానో న్యాయవాది శోభా గుప్తా వెల్లడించారు.
Fake PMO Officer: ప్రధానమంత్రి కార్యాలయ (పీఎంఓ) అధికారినంటూ గుజరాత్ కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా జమ్మూ కాశ్మీర్ అధికార యంత్రాంగాన్నే బురిడి కొట్టించాడు. ఏకంగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ కార్లలో తిరుగుతూ.. స్టార్ హోటళ్లలో బస చేస్తూ సకలభోగాలను అనుభవించాడు. ఇదిలా ఉంటే సరిహద్దులోని సున్నిత ప్రాంతాలను పర్యటించాడు. ఆయకు భద్రత కల్పిస్తున్న సిబ్బందితో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు. అయితే చివరకు…
ప్రేమికుల మధ్య గొడవలు జరగడం సర్వసాధారణం. గొడవలు జరిగిన తర్వాత రెండు రోజులు మాట్లాడకపోవడం.. మళ్లీ నార్మల్ అవ్వడం కామన్. ఇలా కాకుండా ప్రేమికులు గొడవలు పడి ఒకర్నొకరు చంపుకున్న ఘటనలను కూడా చాలా చూశాం. కానీ ఓ యువకుడు మాత్రం తన ప్రేయసితో గొడవపడి తనను తానే శిక్ష వేసుకున్నాడు.
H3N2 Virus: దేశంలో హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుఎంజా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఈ వైరస్ బారిన పడిన ఓ మహిళ మరణించింది. దీంతో ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 7కు చేరుకుంది. జనవరి 1 నుంచి మార్చి 5 వరకు దేశంలో 451 హెచ్3ఎన్2 వైరస్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం గుజరాత్ రాష్ట్రంలో వడోదరలో 58 ఏళ్ల మహిళ హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుఎంజా వైరస్ కారణంగా మరణించింది. గత వారం కర్ణాటక, హర్యానాల్లో ఇద్ధరు…
Kidnap: పెళ్లి కోసం మహారాష్ట్ర నుంచి నిరుపేద, మైనర్ బాలికలను అపహరించి పొరుగు రాష్ట్రాలైన గుజరాత్, రాజస్థాన్‌లలో అమ్ముతూ కొన్ని లక్షల వ్యాపారం చేస్తున్నారు.
Gujarat passes resolution On BBC Documentary on Modi: బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్(బీబీసీ) ప్రధాని నరేంద్ర మోదీపై రూపొందించిన డాక్యుమెంటరీ ‘‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’’ దేశంలో తీవ్ర దుమారాన్ని రేపింది. ఇటు భారత్ లోనూ.. అటు బ్రిటన్ లోనూ ఈ డాక్యుమెంటరీపై విమర్శలు రావడంతో పాటు పలువురు సమర్థించారు. భారత దేశం ఏకంగా దీన్ని ‘వలసవాద మనస్తత్వం’గా అభివర్ణించింది. 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో అప్పటి రాష్ట్ర సీఎంగా ఉన్న నరేంద్రమోదీ ప్రమేయం…
Gujarat IAS officer held hostage, thrashed: గుజరాత్ లో ఏకంగా ఓ ఐఏఎస్ అధికారిని బందీగా చేసుకుని చితకబాదారు ముగ్గురు వ్యక్తులు. ఫిషరీస్ ప్రాజెక్టు తనిఖీలో భాగంగా సదరు వ్యక్తుల తప్పులను ఎత్తిచూపిన సందర్భంలో కాంట్రాక్టర్, అతడి అనుచరులు ఐఏఎస్ అధికారితో పాటు అతని సిబ్బందిని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన సబర్ కాంత జిల్లా పర్యటన సందర్భంగా చోటు చేసుకుంది. దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.