Diamonds Theft: గుజరాత్‌లోని ప్రముఖ వజ్రాల వ్యాపారిని మోసగించిన దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ ఆదివారం ప్రకటించింది. ఒక గుజరాత్ వజ్రాల వ్యాపారిని ముంబైకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఫిబ్రవరిలో సంప్రదించారు.
PM Narendra Modi: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), బీజేపీకి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్ ప్రచారాన్ని ప్రారంభించింది. గుజరాత్ అహ్మదాబాద్ లోని పలు ప్రాంతాల్లో ‘‘మోదీ హఠావో-దేశ్ బచావో’’ వ్యాఖ్యలతో పోస్టర్లను అంటించారు ఆప్ కార్యకర్తలు. దేశవ్యాప్తంగా పోస్టర్ల ప్రచారాన్ని ప్రారంభించిన రోజు తర్వాత ఈ అరెస్టులు జరిగాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రధాని మోదీపై అభ్యంతరకర పోస్టర్లు అంటించినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారు తమ పార్టీ కార్యకర్తలే అని గుజరాత్ ఆప్ చీఫ్…
Ram Navami violence: శ్రీరామ నవమి రోజు ఆరు రాష్ట్రాల్లో హింసాకాండ జరిగింది. శ్రీరాముడి ఊరేగింపు సమయంలో రెండు వర్గాల వారు ఒకరిపైఒకరు దాడులు చేసుకోవడం, రాళ్లు రువ్వడం వంటి ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. ఈ హింసాకాండలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించగా.. చాలా మంది గాయపడ్డారు. మహరాష్ట్రలో ఒకరు, పశ్చిమబెంగాల్ లో మరొకరు మరణించారు. మహరాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో హింసాకాండ చెలరేగింది.
కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ప్రతిపక్ష పార్టీల నేతలపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రయోగిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్న వేళ.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.
Bribery Case: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం రాజ్‌కోట్‌లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్‌టి) డైరెక్టర్ జవరిమల్ బిష్ణోయ్ ను సిబిఐ అరెస్టు చేసింది.
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ కేసులో 11 మంది రేప్ దోషులలో ఒకరు గుజరాత్ ప్రభుత్వ కార్యక్రమంలో వేదికపై బిజెపి ఎంపి, ఎమ్మెల్యేతో కనిపించారు.
ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారికి సూరత్ కోర్ట్ 2 ఏళ్ల జైల్ శిక్ష విధించడం షాక్ కు గురిచేసిందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో, రాష్ట్రంలో అక్కడ బీజేపీ.. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని మండిపడ్డారు.
Modi Surname Case: కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పు చెప్పింది. 2019లో ‘‘మోదీ ఇంటిపేరు’’ వ్యాఖ్యలపై పరువునష్టం కేసులో శిక్షను ఎదుర్కోనున్నారు. శిక్ష విధించిన తర్వాత సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి 30 రోజుల బెయిల్ మంజూరు చేసింది. తీర్పుపై అప్పీల్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అంతకుముందు రోజు సూరత్ కు వచ్చిన రాహుల్ గాంధీకి కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.
Supreme Court: 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులకు శిక్షను తగ్గించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించేందుకు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, జెబి పార్దివాలాలతో కూడిన ధర్మాసనం కొత్త బెంచ్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు బిల్సిస్ బానో న్యాయవాది శోభా గుప్తా వెల్లడించారు.