Gujarat: ఎంతటి కష్టం వచ్చిందో.. ఒకే కుటుంబంలోని 7గురు సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన గుజరాత్ లోని సూరత్ లో చోటు చేసుకుంది. ఘటన స్థలం నుంచి పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
సూరత్ నివసిస్తున్న కుటుంబం శనివారం శవాలుగా కనిపించారు. ముగ్గురు పిల్లలతో సహా కుటుంబంలోని ఏడుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నట్లు, అందుకే ఈ తీవ్రమైన సంఘటన వైపు అడులు వేస్తున్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు.
Read Also: Uttar Pradesh: దసరా ఉత్సవాలు చూసేందుకు వచ్చిన బాలిక కిడ్నాప్, గ్యాంగ్ రేప్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరుగురు విషం సేకరించి చనిపోగా, ఒకరు ఉరేసుకుని మరణించారు. సూరత్ లోని సిద్దేశ్వర అపార్ట్మెంట్ లో ఈ ఘటన జరిగింది. మృతుల్లో భార్యాభర్తలు, భర్త తల్లిదండ్రులతో పాటు ఆరేళ్ల కుమారుడు, 10, 13 ఏళ్ల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆత్మహత్యకు దారి తీసిన ఖచ్చితమైన సమాచారాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్థానిక డీసీపీ తెలిపారు.
మృతులను కానుభాయ్ సోలంకి, అతని భార్య శోభాబెన్, కుమారుడు మనీష్, అతని భార్య రీటా మరియు వారి ముగ్గురు పిల్లలుగా గుర్తించారు.కాంట్రాక్టర్ గా పనిచేస్తున్న మనీష్ సిలింగ్ ఫ్యాన్ కి ఉరేసుకోగా.. మిగిలిన వారి మృతదేహాలను మంచంపై కనుగొన్నారు.