Gujarat: శనివారం గుజరాత్ సూరత్ లోని శ్రీ సిద్ధేశ్వర్ కాంప్లెక్స్‌లో ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. కాగా ఘటన స్థలంలో విషం బాట్టిల్ తో పాటుగా సూసైడ్ లెటర్ దొరకడంతో అందరూ అది సామూహిక ఆత్మహత్యగా భావించారు. అయితే తాజాగా ఆ ఘటనకు సంబందించిన పోస్టుమార్టం రిపోర్ట్స్ వచ్చాయి. ఆ రిపోర్ట్స్ ఆధారంగా అసలు నిజాలు వెలుగు చూశాయి. అందరూ భావించినట్లు కుటుంభం సభ్యులు అందరూ కలిసి సామూహిక ఆత్మహత్యకు పాల్పడలేదు. మనీష్ సోలంకి తన కుటుంభ సభ్యులకు విషమిచ్చి చంపేశారు. అలానే అతని పెద్ద కుమార్తె మెడ పైన, అతని తల్లి మెడ పైన కూడా గొంతు నులిమి చంపిన గుర్తులు కనిపించాయి. పోస్టుమార్టం రిపోర్ట్ లో మనీష్ సోలంకితో పాటు అతని భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక పసికందు, అతని వృద్ధ తల్లి మృతదేహాలలో విషం కనిపించింది. అయితే అతని తల్లీ, కూతురు పోస్టుమార్టం నివేదికలో గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేయడం వల్లే ఇద్దరూ చనిపోయారని తేలింది.
Read also:Vizianagaram Train Accident: విజయనగరం రైలు ప్రమాదం.. విచారణ ప్రారంభం
అలానే ఘటన స్థలంలో దొరికిన సూసైడ్ నోట్ లో మనీష్ పేరు మాత్రమే ఉంది. మిగిలిన కుటంబసభ్యుల పేర్లు లేవు. కావున మనీష్ ముందుగా అందరిని చంపి తరువాత తాను చనిపోయినట్లు తెలుస్తుంది. కాగా మనీష్ సోలంకి కుటుంబాన్ని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియలేదు. శనివారం పాలన్‌పూర్ పాటియా ప్రాంతం లోని శ్రీ సిద్ధేశ్వర్ కాంప్లెక్స్ లోని సి-2 టవర్ లోని ఫ్లాట్ నంబర్ జి-1 నుండి చెడువాసన వస్తున్న క్రమంలో స్థానికులు ఇంటి తలుపు తట్టగా ఎవరు స్పందించలేదు. ఈ నేపథ్యంలో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనాస్థలానికి వచ్చి తలుపు పగలగొట్టి చూడగా.. ఇంటీరియర్ డిజైన్ వ్యాపారి మనీష్ సోలంకి (37), అతని భార్య రీటా బెన్ సోలంకీ, తండ్రి కాను సోలంకి, తల్లి శోభన, కూతురు దిశా సోలంకి, కూతురు కావ్య సోలంకి, కుమారుడు కుశాల్ సోలంకి విగతజీవులుగా పడివున్నారు. దీనితో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చెప్పాట్టరు.