Boy Falls Into Borewell: బోరుబావిలో పడిన రెండేళ్ల బాలుడు.. 9 గంటలు శ్రమించి బయటకు తీసుకొచ్చిన రెస్క్యూ టీమ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2 Year Old Boy Falls Into Borewell In Gujarat: బోరుబావిలో పడిన రెండేళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. రెస్క్యూ టీమ్ దాదాపు 9 గంటలపాటు శ్రమించి చిన్నారిని బయటకు తీసుకొచ్చింది. ఈ ఘటన గుజరాత్ జామ్‌నగర్‌లోని గోవానా గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. బాలుడుని వెంటనే చికిత్స కోసం జామ్‌నగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి…
గోవానా గ్రామంలో మంగళవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఓ రెండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్ (ఫైర్ సర్వీస్ డిపార్ట్‌మెంట్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) రంగంలోకి దిగాయి. మంగళవారం రాత్రి 7 గంటలకు సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీమ్స్.. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు బాలుడిని బయటకు తీసుకొచ్చాయి. బాలుడు బతికే ఉండడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
Also Read: MS Dhoni: క్యూ లైన్‌లో నిల్చొని మరీ.. అమ్మవారిని దర్శించుకున్న ఎంఎస్ ధోనీ! వీడియో వైరల్
చికిత్స నిమిత్తం బాలుడుని వెంటనే జామ్‌నగర్‌లోని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌లో అగ్నిమాపక శాఖ నుంచి రెండు బృందాలు.. ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ దళాలు పాల్గొన్నట్లు ఐ అధికారి పేర్కొన్నారు. దాదాపు 9 గంటలపాటు శ్రమించి చిన్నారిని బయటకు తీసుకొచ్చామని చెప్పారు. గత జనవరిలో గుజరాత్‌లోని ద్వారకా జిల్లాలో బోరుబావిలో పడిపోయిన మూడేళ్ల బాలికను రెస్క్యూ టీమ్స్ రక్షించినా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించింది.
తాజావార్తలు
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!