Bomb threats: అహ్మదాబాద్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb threats: కొన్ని రోజుల క్రితం ఢిల్లీలోని పలు పాఠశాలకు బాంబు బెదిరింపు ఈమెయిళ్లు వచ్చాయి. అధికారుల తనిఖీల తర్వాత ఇవి బూటకపు బెదిరింపులని తేలింది. ఇదిలా ఉంటే సోమవారం అహ్మదాబాద్‌లో పలు స్కూళ్లకు కూడా ఇలాంటి బెదిరింపు సందేశాలే వచ్చాయి. లోక్‌సభ మూడోదశ ఎన్నికల్లో రేపు గుజరాత్ లోని అన్ని ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. నగరంలోని మొత్తం 7 పాఠశాలకు రష్యన్ IP అడ్రస్‌తో కూడిన సర్వర్‌ల నుండి ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు వర్గాలు తెలిపాయి. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌తో సహా పోలీసు అధికారుల బృందాలు పాఠశాలల్లో సోదాలు నిర్వహించాయి. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు.
Read Also: Vijayendra Prasad: రాజమౌళి తండ్రి ఎన్నికల ప్రచారం.. ఎవరికోసమో తెలుసా?
Also Read
- Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
- Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
- Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్‌చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చిన పాఠశాలల్లో అమృత విద్యాలయం, కేంద్రీయ విద్యాలయ ONGC (చంద్‌ఖేడా), ఆర్మీ స్కూల్ (షాహిబాగ్), ఆనంద్ నికేతన్ మరియు DPS (బోపాల్) ఉన్నాయి. ఉన్నాయి. ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని 28 ఎంపీ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి.
గత వారం ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, గ్రేటర్ నోయిడాలోని 151 స్కూళ్లకు బాంబు బెదిరింపు ఈమెయిళ్లు వచ్చాయి. దీంతో విద్యార్థుల్ని వెంటనే స్కూళ్ల నుంచి ఇళ్లకు పంపించారు. పోలీసులు ఇతర అధికారులు పాఠశాలల్ని క్షణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత బూటకపు బాంబు బెదిరింపులుగా తేల్చారు. ఈ ఈమెయిళ్లు కూడా రష్యన్ డొమైన్ నుంచే వచ్చినట్లు అధికారులు తెలిపారు. నిందితులు ఐపీ అడ్రస్‌ను మాస్క్ చేసి ఉండవచ్చని అధికారులు హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికలకు విఘాతం కలిగించేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రగా అధికారలు అనుమానిస్తున్నారు. తరుచుగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఉపయోగించే అరబిక్ పదం ‘సవారిమ్’తో ఈ ఈమెయిళ్లు ముడిపడి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్‌కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
-
Tesla Kids Bike: పిల్లల కోసం టెస్లా కొత్త బ్యాలెన్స్ బైక్.. పెడల్స్, మోటార్ లేకుండానే సైక్లింగ్ నేర్పించే ప్రత్యేక డిజైన్
-
spirit : స్పిరిట్ పోస్ట్‌పోన్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా
-
Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్‌మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!