LSG vs RR : లక్నోపై రాజస్థాన్ ఘన విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్-2024లో రాజస్థాన్ ఎనిమిదో విజయాన్ని నమోదు చేసింది. లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 197 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ పూర్తి చేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో సంజు శాంసన్ (71*; 33 బంతుల్లో), ధ్రువ్ జురెల్ (52*; 34 బంతుల్లో) అర్ధశతకాలతో చెలరేగిపోయారు. జోస్ బట్లర్ (34), జైస్వా్‌ల్ (24) రాణించారు. లఖ్‌నవూ బౌలర్లలో యశ్ ఠాకూర్ 1, మార్కస్ స్టాయినిస్ 1, అమిత్ మిశ్రా 1 వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ 196 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (76), దీపక్ హూడా (50) రాణించారు. సందీప్ శర్మ 2, బౌల్ట్ 1, అవేశ్ ఖాన్ 1, అశ్విన్ 1 వికెట్ తీశారు.
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. వాస్తవానికి ఈ జట్టుకు మొదట అద్భుత ఆరంభం లభించింది. కానీ ఫినిషింగ్ మాత్రం సరిగ్గా చేయలేదు. దీంతో ఈజీగా 200 దాటుతుందని అనుకున్న స్కోరు 196కే ఆగిపోయింది.
Also Read
- Sandeep Patil: రోహిత్, కోహ్లీ లేకపోయినా టీమిండియాకు నష్టమేమీ లేదు.. మాజీ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
- Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
- Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
ఓపెనర్ క్వింటన్ డికాక్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత గత మ్యాచ్ సెంచరీ వీరుడు స్టోయినీస్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో కేవలం 11 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన కష్టాల్లోకి వెళ్లింది లఖ్‌నవూ. అనంతరం కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్ ఆడి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 76 పరుగులు చేశాడు. అతడికి రాహుల్ హుడా (31 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 50 పరుగులు) మంచి సహకారం అందించాడు. దీంతో 12 ఓవర్లలోనే లఖ్‌నవూ 126 స్కోరు దాటింది.
అయితే క్రీజులో కుదురుకున్న హుడా, రాహుల్ తర్వాత ఔట్ అయిపోయారు. దీంతో స్కోరు నెమ్మదించింది. చివర్లో రాజస్థాన్ బౌలర్లు చురుగ్గా బంతులు సంధించారు. పూరన్(11), ఆయుష్ బదోని(18 నాటౌట్), కృనాల్ పాండ్య(15 నాటౌట్) పరుగులు చేశారు. దీంతో 196 పరుగుల దగ్గర లఖ్‌నవూ ఇన్నింగ్స్ ముగించింది. రాయల్స్ బౌలర్లలో సందీప్ శర్మ 2, బౌల్ట్ , అవేశ్ ఖాన్, అశ్విన్ తలో వికెట్ తీశారు.
తాజావార్తలు
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
Sandeep Patil: రోహిత్, కోహ్లీ లేకపోయినా టీమిండియాకు నష్టమేమీ లేదు.. మాజీ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Honor 600 Elite 5G: హానర్ 600 Elite 5G లాంచ్.. 108MP కెమెరా, 8,100mAh బ్యాటరీ, IP69K రేటింగ్
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!