గుజరాత్‌లోని సూరత్‌లో సచిన్ పాలి గ్రామంలో ఆరు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారని, శిథిలాల కింద నుంచి ఒక మహిళను సజీవంగా బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. భవనంలో 30 అపార్ట్‌మెంట్లు ఉన్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Bandhan bank: బంధన్ బ్యాంక్ తాత్కాలిక ఎండీ, సీఈవోగా రతన్ కుమార్ నియామకం
శనివారం మధ్యాహ్నం భవనం కూలిపోయినప్పుడు ఐదు కుటుంబాలు భవనం లోపల ఉన్నారని పోలీసులు తెలిపారు. కాంక్రీట్ శిథిలాలలో అనేక మంది చిక్కుకుపోయారని భావిస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. రెస్క్యూ అధికారులు శిధిలాల్లో చిక్కిన వారిని ప్రాణాలతో తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.. సాయంత్రం సమయానికి ఒక మృతదేహాన్ని బయటకు తీశారు. ఇక రెస్క్యూ పనిలో సహాయం చేయడానికి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్‌ని పిలిపించారు.
ఇది కూడా చదవండి: Smartwatch Saves Life: “స్మార్ట్‌వాచ్” ఉపయోగించి విమానంలో మహిళ ప్రాణాలు కాపాడిన డాక్టర్..
సూరత్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సౌరభ్ పర్ఘి మాట్లాడుతూ.. ఆరు అంతస్థుల భవనం కుప్పకూలిందన్నారు. కొద్దిసేపటి క్రితం ఒక మహిళను రక్షించినట్లు వెల్లడించారు. మరో నలుగురు లేదా ఐదుగురు లోపల చిక్కుకుపోయి ఉండవచ్చన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Anakapalli: మైనర్ బాలికపై ఓ యువకుడు కత్తితో దాడి.. బాలిక మృతి