Gujarat: గుజరాత్ వడోదరలో దారుణం జరిగింది. తన ఫ్రెండ్‌ని కలిసేందుకు వెళ్లిన టీనేజ్ యువతిపై గుర్తుతెలియన వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమె స్నేహితుడిని అడ్డుకున్న దుండగులు బాలికపై అత్యాచారం చేశారని శనివారం పోలీసులు తెలిపారు. ఈ ఘటన నవరాత్రి సందర్భంగా గర్భా ఈవెంట్ కోసం నగరానికి భారీ సంఖ్యలో ప్రజలు వచ్చినప్పుడు జరిగింది.
Read Also: Mallu Bhatti Vikramarka: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చారిత్రాత్మకమైంది..
నగరంలోని లక్ష్మీపుర ప్రాంతంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో తన చిన్ననాటి స్నేహితుడిని కలిసేందుకు యువతి బయటకు వెళ్లింది. ఇద్దరు స్కూటీపై భాయిలీ ప్రాంతం గుండా తిరిగి వస్తుండగా, అర్ధరాత్రి సమయంలో ఐదుగురు వ్యక్తులు వీరిని అడ్డించారు. కొంత వాగ్వాదం తర్వాత అక్కడ నుంచి ఇద్దరు వ్యక్తులు వెళ్లిపోగా, మిగతా ముగ్గురిలో ఇద్దరు టీనేజ్ బాలికపై అత్యాచారం చేయగా, మరొకరు ఆమె స్నేహితుడిని అడ్డగించాడు. ఘటన తర్వాత బాధితులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. సాక్ష్యాలు సేకరించారు. సాంకేతికి నిఘా, ఇతర మార్గాల్లో నిందితులను గుర్తించడానికి టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు వడోదరా రూరల్ ఎస్పీ రోహిత్ ఆనంద్ వెల్లడించారు. ఇదే విధంగా, మహారాష్ట్రలోని పూణే శివార్లలో ఏకాంత ప్రదేశంలో గురువారం రాత్రి 21 ఏళ్ల మహిళపై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె స్నేహితుడిని దారుణంగా కొట్టారు.