ఆ జంట ఒకరినొకరు ప్రేమించుకున్నారు. రోజూ ప్రేమ కలాపాల్లో మునిగి తేలుతున్నారు. షికార్లు చేస్తున్నారు. హాయిగా ప్రేమ ఊహాల్లో విహరిస్తున్నారు. అయితే ఏకాంతంగా గడపాలని నిర్ణయం తీసుకున్నారు. అంతే ఒక హోటల్ గది బుక్ చేసుకున్నారు. ఇద్దరూ ఇష్టపూర్వకంగా పడక పంచుకున్నారు. అయితే శృంగారంలో పాల్గొన్న కొద్దిసేపటికే ప్రియురాలి ప్రాణాలు వదిలింది. ఈ ఘటన అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. కలయిక తర్వాత అసలేం జరిగింది. సంతోషంగా గడుపుదామనుకుని వచ్చిన జంట మధ్య ఏం జరిగింది. అయితే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: Iran Ex President: అతనే ఇజ్రాయెల్ గుఢచారి.. ఇరాన్లో డబుల్ ఏజెంట్లు ఉన్నారు..
23 ఏళ్ల నర్సింగ్ గ్రాడ్యుయేట్, ఆమె ప్రియుడు (26) గుజరాత్‌లోని సెప్టెంబర్ 23న నవ్‌సారి జిల్లాలో ఒక హోటల్ గది బుక్ చేసుకున్నారు. ఇద్దరూ ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొన్నారు. అనంతరం ప్రియురాలి యోనిలోంచి రక్తస్రావం జరగడం మొదలైంది. అయితే ఈ ఘటనతో ప్రియుడు కంగారు పడ్డాడు. ఏం చేయాలో తోచక.. మొబైల్‌లో ఆన్‌లైన్ సర్చ్ చేశాడు. దీంతో అతడు ఒక క్లాత్‌ను తీసుకొచ్చి అడ్డుపెట్టాడు. అయినా కూడా రక్తస్రావం ఆగలేదు. మరింత ధాటిగా రావడం మొదలుపెట్టింది. ఈ పరిణామంతో మరింత ఆందోళన చెందిన ప్రియుడు.. తన స్నేహితుడిని హోటల్‌కు రప్పించాడు. ప్రియురాలు మూర్ఛపోయి ఉంది. అనంతరం ఇద్దరూ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే విపరీతమైన రక్తస్రావం జరగడంతో ప్రాణాలు కోల్పోయింది. వైద్యులు పరీక్షించి సివిల్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడికి తీసుకువెళ్లగానే చనిపోయినట్లు ప్రకటించారు. దీంతో వారు మరింత భయాందోళనకు గురయ్యారు.
ఇది కూడా చదవండి: Apple AirPods: ఎయిర్‌పాడ్ ద్వారా చోరీకి గురైన.. రూ.5 కోట్ల విలువైన ఫెరారీ కారు లభ్యం!
బాధితురాలి తల్లిదండ్రులకు ప్రియుడు ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఆస్పత్రికి చేరుకోగానే కుమార్తె శవమై కనిపించడంతో పేరెంట్స్ తల్లడిల్లిపోయారు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని ప్రియుడిని అరెస్ట్ చేశారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక.. మరింత సమాచారం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Rajinikanth: రజనీకాంత్ డిశ్చార్జ్ కావడానికి ఎన్ని రోజులు పడుతుందంటే?