Teesta Setalvad: 2002 గుజరాత్ అల్లర్ల కేసులో కల్పిత సాక్ష్యాలను సృష్టించడం, పలువురుని కేసులో ఇరికించేందుకు కుట్ర చేసిన కేసులో ప్రముఖ హక్కుల నేత తీస్తా సెలత్వాడ్ నిందితురాలిగా ఉన్నారు. తాజాగా ఈ కేసులో ఆమెను వెంటనే లొంగిపోవాలని, బెయిల్ తిరస్కరిస్తూ గుజరాత్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శనివారం వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. గతేడాది సెప్టెంబరులో ఆమెకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఇప్పటివరకు ఆమెను అరెస్టు చేయలేదు.
ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతల విషయంలో గుజరాత్ హైకోర్టు తీర్పును మరోసారి సమీక్షించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. దీనిని స్వీకరించిన గుజరాత్ హైకోర్టు జస్టిస్ బీరన్ వైష్ణవ్ విచారణ అనంతరం కేసును జూన్ 30కి పడింది.
Gujarat High Court: బాలిక అబార్షన్ పిటిషన్ పై గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 17 ఏళ్ల బాలిక తన 7 నెలల గర్భాన్ని తొలగించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సందర్భంగా ఈ వ్యాఖ్య చేసింది కోర్టు. గతంలో 14-15 ఏళ్ల వయసులోనే ఆడపిల్లలు పెళ్లి చేసుకుని, 17 ఏళ్లకు బిడ్డకు జన్మనిచ్చేవారని గుజరాత్ హైకోర్టు గురువారం మౌఖికంగా వ్యాఖ్యానించింది.
Rahul Gandhi: పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ హైకోర్టు 2 ఏళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రజాప్రతినిధ్య చట్టం-1951 ప్రకారం రెండేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ ఏళ్లు జైలు శిక్ష పడితే ఆటోమెటిక్ గా పదవి కోల్పోతారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కూడా తన ఎంపీ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఈ కేసులో రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.
మోడీ ఇంటిపేరు కేసులో విధించిన శిక్షపై స్టే ఇవ్వాలంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. కింద కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. రాహుల్ పిటిషన్ పై ( ఏప్రిల్ 27 ) గురువారం విచారణ జరిగే అవకాశం ఉంది.
PM Modi: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టులో చుక్కెదురు అయింది. ప్రధాని నరేంద్రమోదీ డిగ్రీ వివరాలను వెల్లడించాలని గుజరాత్ యూనివర్సిటీని ఆదేశిస్తూ జారీ అయిన ఉత్తర్వులను ఆ రాష్ట్ర హైకోర్టు ఈ రోజు కొట్టేసింది. ఆ సమాచారం అవసరం లేదని కోర్టు పేర్కొంది. ఈ వివరాలు అడిగినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు రూ. 25,000 జరిమానా విధించింది. కేజ్రీవాల్ నాలుగు వారాల్లో గుజరాత్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో డబ్బును…