BJP on the way to a huge victory in Gujarat elections: గుజరాత్ రాష్ట్రంలో చరిత్ర సృష్టించింది భారతీయ జనతా పార్టీ(బీజేపీ). గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించే దిశగా వెళ్తోంది. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలు ఉంటే.. బీజేపీ ఏకంగా 154 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ దారుణంగా చతికిల పడింది కేవలం 19 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే బీజేపీ…
Congress camp politics in Himachal Pradesh elections: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించే దిశగా పరుగులు పెడుతోంది. 150 సీట్ల కన్నా ఎక్కువ స్థానాలు సాధించి ఏడో సారి అధికారంలోకి రానుంది. ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్ ప్రజలు మాత్రం ఇటు బీజేపీకి కానీ అటు కాంగ్రెస్ పార్టీకి కానీ స్పష్టమైన మెజారిటీ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. హిమాచల్ ప్రదేశ్ లో…
Gujarat Cleric Slams Muslim Women In Elections: ముస్లిం మహిళలను ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎంపిక చేసేవారు ఇస్లాంకు వ్యతిరేకం వ్యతిరేకంగా మతాన్ని నిర్వీర్యం చేస్తున్నారంటూ గుజరాత్ రాష్ట్రానికి చెందిన మతాధికారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ రెండో విడత ఎన్నికలకు ముందు ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్ కు చెందిన జామా మసీద్ మతాధికారి షబ్బీర్ అహ్మద్ సిద్ధిఖీ మాట్లాడుతూ.. ఇస్లాంలో నమాజ్ కంటే ముఖ్యమైనది ఏదీ లేదని, మసీదుల్లో మహిళలు నమాజ్…
BJP Retains Gujarat, Himachal: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో మళ్లీ బీజేపీని తిరుగులేని స్థానంలో నిలబెట్టారు అక్కడి ప్రజలు. మళ్లీ అధికారం బీజేపీ కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. మొత్తం 182 స్థానాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీలో 100కు పైగా స్థానాలు గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఇక హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కూడా బీజేపీనే గెలుస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచానా వేస్తున్నాయి.
Muslims Boycott Polls In Gujarat Village: గుజరాత్ లో రెండో విడత ఎన్నికలు ఈ రోజు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలి విడత డిసెంబర్ 1న పూర్తవగా.. నేడు రెండో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉంటే ఓ గ్రామంలోని ముస్లింలు మాత్రం ఎన్నికలను బహిష్కరించారు.
Congress objects to Modi’s ‘roadshow’, questions ECI’s silence: గుజరాత్ ఎన్నికలకు సంబంధించి రెండో విడత పోలింగ్ ఈరోజు జరుగుతోంది. ఈనెల 8న గుజరాత్ తో పాటు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇదిలా ఉంటే ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రధాని మోదీ. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అహ్మదాబాద్‌లోని రాణిప్‌లోని…
గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ ఇవాళ ఉదయం ప్రారంభమైంది.. తన సొంత రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ఓటుహక్కు వినియోగించుకున్నారు.. అహ్మదాబాద్‌లోని రణిప్ ప్రాంతంలో ఉన్న నిషాన్ పబ్లిక్ స్కూల్‌లో తన ఓటు వేశారు మోడీ… ప్రత్యేక భద్రత మధ్య ఓటింగ్ కేంద్రానికి చేరుకుంది మోడీ కాన్వాయ్.. ఇక, తన వాహనం దిగి నడుచుకుంటూ వెళ్లిన ఆయన.. సామాన్య ఓటరుగానే మిగతా ఓటర్ల మధ్య క్యూలైన్‌లో వెళ్లి ఓటు వేశారు.. ఇక, ప్రధానిని చూసేందుకు…
ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ఎన్నికల పోలింగ్ సోమవారం జరగనుంది. రెండో దశలో ఉత్తర, మధ్య గుజరాత్‌లోని 14 జిల్లాల్లో ఉన్న స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా.. ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి.