Bhagwant Mann criticized Congress is in a coma: గుజరాత్ ఎన్నికల్లో ఓటమి గురించి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నిందిస్తూ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. అయితే ఈ వ్యాఖ్యలపై ఆప్ పార్టీ భగ్గుమంటోంది. తాజాగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తీవ్రంగా స్పందించారు. ఆప్ పార్టీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. రాహుల్ గాంధీ గుజరాత్ లో ఎన్నిసార్లు పర్యటించారు..? ప్రశ్నించారు. కేవలం ఒకేసారి పర్యటించి రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో గెలుపొందాలని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు భగవంత్ మాన్. సూర్యుడు అస్తమించే రాష్ట్రం గుజరాత్ లో ఎన్నికలు జరిగాయని.. రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో యాత్ర’ సూర్యుడు ఉదయించే కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిందని.. ముందు రాహుల్ గాంధీ టైమింగ్ సరిచేసుకోనివ్వండి అంటూ సెటైర్లు వేశారు.
Read Also: Leopard At Hetero Update : చిరుతకోసం అన్వేషణ.. 11 గంటలుగా అధికారుల హైరానా
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యర్థి పార్టీల్లోకి చేరుతున్నారని.. పార్టీ చాలా పేవలంగా మారిందని.. ప్రత్యర్థి పార్టీకి సంఖ్యాబలం లేనప్పుడు ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి వారికి తమ ఎమ్మెల్యేలను అమ్మేస్తోందని భగవంత్ మాన్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కోమాలో ఉందని అన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని.. ఆ తరువాత అక్కడ బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు.
ఆప్ లేకపోతే గుజరాత్ రాష్ట్రంలో బీజేపీని ఓడించే వాళ్లం అని నిన్న రాజస్థాన్ లో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. ఆప్, బీజేపీకి బీ-టీమ్ గా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ ని లక్ష్యంగా చేసుకునేందుకు బీజేపీ, ఆప్ ను వినియోగిస్తోందని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఆప్ ఘాటుగానే స్పందించింది. బీజేపీకి తామే ప్రత్యామ్నాయం అని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఇటీవల గుజరాత్ ఎన్నికల్లో ఆప్ బోణీ చేసింది. మొత్తం 182 స్థానాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీలో 156 స్థానాల్లో గెలిచి బీజేపీ రికార్డ్ సృష్టించింది. కాంగ్రెస్ కేవలం 17 స్థానాల్లో గెలపొందగా.. ఆప్ 5 స్థానాల్లో గెలిచింది.