HONOR Magic V5: హానర్ మ్యాజిక్ V5 స్మార్ట్‌ఫోన్ ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. అయితే తాజగా ఈ స్మార్ట్‌ఫోన్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఇంతవరకు నమోదు కాని ఘనతను పొందింది. అదేంటంటే, 104 కిలోల (229.2 lbs) బరువును ఈ ఫోన్ లిఫ్ట్ చేయగలిగింది. ఈ అద్భుత రికార్డును ఆగస్టు 1న దుబాయ్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికార ప్రతినిధి ఎమ్మా బ్రెయిన్ పర్యవేక్షణలో నమోదు…
Realme GT 7: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ (realme) తన తాజా ఫ్లాగ్‌షిప్ ఫోన్ GT 7 కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఒక వినూత్న కార్యక్రమంలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఈ రికార్డు “మొబైల్ ఫోన్‌పై అత్యంత సమయం సినిమాలు వీక్షించిన మారథాన్”గా నమోదు అయింది. మే 23న గిన్నీస్ అధికార ప్రతినిధుల సమక్షంలో ఈ రికార్డు నమోదైంది. GT 7 స్మార్ట్‌ఫోన్‌తో మొత్తం 24 గంటల పాటు నాన్-స్టాప్ మూవీ ప్లేబ్యాక్ చేయడంతో…
Guinness World Record: తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన క్రాంతి కుమార్ పణికేరా తన అసాధారణ ప్రతిభతో గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం సంపాదించాడు. కేవలం ఒక నిమిషంలో తన నాలుకను ఉపయోగించి 57 ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్స్ ఆపడం ద్వారా ఈ అరుదైన రికార్డును సాధించారు. అసాధారణమైన సాహసాలకు ప్రసిద్ధి చెందిన క్రాంతిని అభిమానులు ప్రేమగా “డ్రిల్ మాన్” అని పిలుస్తారు. ఈ సందర్బంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో…
Guinness Record : ఫిలిప్పీన్స్‌లో కోడి ఆకారంలో ఉన్న ఓ పెద్ద హోటల్ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు అనేక విభిన్న ఆకారాల్లో హోటళ్లు, రిసార్ట్లు చూశాము, కానీ ఫిలిప్పీన్స్‌లోని ఒక కొత్త హోటల్ ఇప్పుడు అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ హోటల్ ప్రత్యేకత ఏంటంటే, అది పూర్తిగా ఒక పెద్ద కోడిని పోలిన ఆకారంలో నిర్మించబడింది..! ఈ కోడి ఆకారంలో ఉన్న హోటల్ గినిస్ వరల్డ్ రికార్డు సాధించి,…
తల్లి, బిడ్డల బంధం ఎంత గొప్పదో మాటల్లో చెప్పలేనిది. పురుడుపోసుకుని బయటకు వచ్చిన శిశువుకు వెంటనే మురిపాలు తాగిస్తారు. ఈ పాలు బిడ్డకు ఎంతో ప్రయోజనకరం. శిశువు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే శిశువు బయటకు రాగానే వైద్యులు.. మురిపాలు పట్టించమని చెబుతుంటారు.
అల్లికల కళలో ఏపీకి చెందిన స్వాప్నికకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది.. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన స్వాప్నిక.. తన అమ్మమ్మ వద్ద అల్లికలను నేర్చుకొని వాటికి సంబంధించిన మెళకువలను అవలీలగా పసిగట్టి కొత్త అల్లికల గురించి ఆలోచించేది, వాటికి సంబంధించిన కొత్త రికార్డు గురించి తెలుసుకోవడం అంటే స్వాప్నికకు ఇష్టం.
ఈరోజు ఒక ఆసక్తికరమైన ప్రకటన రాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్ ను మెగాస్టార్ చిరంజీవికి అందించే ఒక కార్యక్రమం హైదరాబాదులో జరగబోతోంది. హైదరాబాదులోని ఒక స్టార్ హోటల్లో బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్.. చిరంజీవికి గిన్నిస్ రికార్డుకు సంబంధించిన అవార్డు అందించనున్నారని తెలుస్తోంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిథులతో పాటు…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను మాజీ జేఎన్‌యూ ఉద్యోగి, కంప్యూటర్ ట్రైనర్ వినోద్ కుమార్ చౌధరి (43) అధిగమించారు. గిన్నిస్ రికార్డుల సంఖ్యలో సచిన్‌ను వినోద్ చౌధరి వెనక్కి నెట్టారు. ఢిల్లీకి చెందిన వినోద్.. టైపింగ్‌లో ఏకంగా 20 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సృష్టించారు. ఈ క్రమంలో 19 గిన్నిస్ రికార్డులను కలిగి ఉన్న సచిన్‌ను అతడు దాటేశారు. ఢిల్లీలోని కిరారి సులేమాన్ నగర్ గ్రామంలో వినోద్ కుమార్ చౌధరి నివాసం ఉంటున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని…
Guinness World Record: మన నోటిలో ఉండే ఎముకలు లేని నాలుక ఆహారాన్ని రుచి చూడటానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే నాలుక ఏమి చేయకుండానే కీర్తిని తెస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించగలరా..? ఇకపోతే తాజాగా అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఒక మహిళ ప్రపంచంలోనే అత్యంత విశాలమైన నాలుక (ఆడ) కలిగి ఉన్నట్లు ధృవీకరించబడింది. బ్రిటనీ లకాయో అనే మహిళా ఈ అదృష్టాన్ని పొందింది. బ్రిటనీ లకాయో నాలుక ఏకంగా 7.90 సెం.మీ (3.11 అంగుళాలు)…
Indian National Anthem: గ్రామీ-విజేత సంగీత విద్వాంసుడు రికీ కేజ్ భారత జాతీయ గీతం, భారతదేశ విశిష్ట ప్రదర్శనను ఆవిష్కరించారు. ఈ అసాధారణ ఎడిషన్‌లో పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, రాకేష్ చౌరాసియా, అమన్, అయాన్ అలీ బంగాష్, రాహుల్ శర్మ, జయంతి కుమారేష్, షేక్ కలాషాబి మెహబూబ్, గిరిధర్ ఉడుపా వంటి ప్రముఖ భారతీయ సంగీత విద్వాంసుల ఆకట్టుకునే శ్రేణిని ప్రదర్శిస్తారు. 100 మంది సభ్యుల బ్రిటిష్ ఆర్కెస్ట్రా, కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుండి…