Realme GT 7: లాంచ్ కాకముందే.. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించిన రియల్‌మీ GT 7.. ఎలాగంటే?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme GT 7: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ (realme) తన తాజా ఫ్లాగ్‌షిప్ ఫోన్ GT 7 కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఒక వినూత్న కార్యక్రమంలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఈ రికార్డు “మొబైల్ ఫోన్‌పై అత్యంత సమయం సినిమాలు వీక్షించిన మారథాన్”గా నమోదు అయింది. మే 23న గిన్నీస్ అధికార ప్రతినిధుల సమక్షంలో ఈ రికార్డు నమోదైంది. GT 7 స్మార్ట్‌ఫోన్‌తో మొత్తం 24 గంటల పాటు నాన్-స్టాప్ మూవీ ప్లేబ్యాక్ చేయడంతో ఈ అద్భుతం సాధ్యమైంది. ఈ ప్రయత్నం భాగంగా రియల్‌మీ సంస్థ “Endless Power Journey” పేరిట యూరప్‌లో ప్రత్యేకంగా ఓ క్రూయిజ్ ఈవెంట్ నిర్వహించింది. ఇది ఇటలీ రోమ్ నుండి ప్రారంభమైంది. ఇదే సమయంలో చైనా షెన్‌జెన్ నుండి లైవ్‌స్ట్రీమ్ ద్వారా ప్రారంభించి, 24 గంటలు పూర్తి చేసి గిన్నీస్ రికార్డు అందుకుంది.
Read Also: Bride Calls Off Wedding: తాళి కట్టే సమయంలో ఝలక్ ఇచ్చిన పెళ్లికూతురు.. చివరకు లవర్‌తో..!
Also Read
- Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్‌కు భారీ ఎదురుదెబ్బ..
- Telangana Exhibitors : ఆ 'జీవో 77' రద్దు చేయకుంటే 400 థియేటర్లు మూత.. సీఎం రేవంత్ రెడ్డికి ఎగ్జిబిటర్ల లేఖ
- US-Russia: రష్యాలో ల్యాండ్ అయిన అమెరికా మిలిటరీ విమానం.. ఏం జరుగుతోంది.?
- Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్‌పై అమెరికా ఆఫర్ ఇదేనా?
ఈ ఘనత సాధించడానికి ప్రధాన కారణం realme GT 7 లో ఉన్న 7200mAh భారీ బ్యాటరీ, 100W ఫాస్ట్ చార్జింగ్ సాంకేతికత. దీనికి తోడు ఈ బ్యాటరీ వ్యవస్థకు TUV Rheinland సంస్థ 5-స్టార్ సర్టిఫికేషన్ కూడా ఇచ్చింది. ఇలా సాధ్యమైన బ్యాటరీ లైఫ్ వల్లే నాన్-స్టాప్ మూవీ వీక్షణ సాధ్యమైంది. రియల్‌మీ GT 7, GT 7T సిరీస్ ఫోన్లు మే 27న పారిస్ లో గ్లోబల్‌గా విడుదల కానున్నాయి. భారత మార్కెట్‌లో కూడా అదే రోజు ఈ ఫోన్లు అందుబాటులోకి వస్తాయని కంపెనీ ప్రకటించింది. విడుదల అనంతరం ఈ ఫోన్లు రియల్‌మీ, అమెజాన్ ఇంకా ఇతర రిటైల్ స్టోర్లలో విక్రయానికి అందుబాటులో ఉంటాయి.
Read Also: S**X On Road: బరితెగించిన రాజకీయ నేత.. రోడ్డుమీదే కారు ఆపి పబ్లిక్ గా శృంగారలీలలు..!

రియల్‌మీ GT 7 ఫోన్ ఫీచర్లలో ముఖ్యమైన అంశాలు:
డిస్‌ప్లే: 6.8-ఇంచ్ AMOLED, 144Hz రిఫ్రెష్ రేట్, 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
ప్రాసెసర్: MediaTek Dimensity 9400+ (3nm)
ర్యామ్ & స్టోరేజ్: 12GB/16GB RAM, 256GB – 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ (UFS 4.0)
కెమెరా: 50MP (ప్రధాన కెమెరా), 8MP (అల్ట్రావైడ్), 16MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ: 7200mAh Si/C Li-Ion, 100W ఫాస్ట్ ఛార్జింగ్
ఆపరేటింగ్ సిస్టమ్: Android 15 పై Realme UI 6.0
వాటర్ రెసిస్టెన్స్: IP68/IP69 సర్టిఫైడ్
ఆడియో: స్టీరియో స్పీకర్లు, Hi-Res ఆడియో
ఈ రికార్డు ఫోన్‌తో టెక్నాలజీకి కొత్త ఎత్తుగడలు నిర్ణయించిన రియల్‌మీ, ఇప్పుడు ప్రీమియం మార్కెట్‌లోకి గట్టి పోటీగా అడుగుపెట్టబోతున్నదనే చెప్పవచ్చు. GT 7 లాంచ్ తర్వాత టెక్ ప్రియుల నుంచి ఎలా స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Telangana Congress : కాంగ్రెస్‌లో బిగ్ షాక్.. కొండా సురేఖ, చిన్నారెడ్డికి ఎసరు.?
-
Jagame Sangeetham : “శ్రుతి తప్పితే ఊరుకోను.. గతి తప్పావ్”.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న ‘జగమే సంగీతం’ ట్రైలర్!
-
Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్‌కు భారీ ఎదురుదెబ్బ..
-
CM Security : సీఎం లిఫ్ట్ సడన్ స్టాప్.. భద్రతపై అధికారుల ఫైర్..
-
Telangana Exhibitors : ఆ ‘జీవో 77’ రద్దు చేయకుంటే 400 థియేటర్లు మూత.. సీఎం రేవంత్ రెడ్డికి ఎగ్జిబిటర్ల లేఖ
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!