GST: ఈ ఏడాది ఆదాయ పన్నుల రాయితీల రూపంలో మధ్యతరగతి వర్గానికి ఉపశమనం కల్పించిన కేంద్ర ప్రభుత్వం మరో చర్యకు సిద్ధమవుతోంది. మధ్యతరగతి, తక్కువ ఆదాయ కుటుంబాలను దృష్టిలో ఉంచుకుంది. వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) తగ్గించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
భారత ప్రభుత్వం జీఎస్టీలో విస్తృతమైన మార్పులకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పుల వల్ల సాధారణ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. చాలా వస్తువులను 12% పన్ను స్లాబ్‌ను తొలగించి, 5% స్లాబ్‌లోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
దేశంలో పాత వాహనాల మార్కెట్ గణనీయంగా పెరిగింది. చాలా కంపెనీలు పాత వాహనాలను తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు.. ఈ పాత వాహనాల విక్రయంపై విధించే పన్నుకు సంబంధించి కీలక సమాచారం వెలువడింది. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో శనివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశంలో ఓ పెద్ద నిర్ణయం తీసుకున్నారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) సహా పాత వాహనాల అమ్మకాలపై పన్ను పెంచడానికి అంగీకరించారు. జీఎస్టీ12 శాతం నుంచి 18 శాతానికి పెంచేందుకు అంగీకారం…
జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఏపీ తరపున ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు. ఏపీకి లబ్ధి చేకూరేలా కొన్ని అంశాలపై జీఎస్టీ మినహాయింపులను ఆర్థిక మంత్రి కోరారు.
జీఎస్టీ కౌన్సిల్ సమావేశం శనివారం (జూన్ 22) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగింది. సమావేశానంతరం ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని, ఇప్పుడు రాష్ట్రాలు కలిసి దాని రేటును నిర్ణయించాలని అన్నారు.
వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) కౌన్సిల్ 53వ సమావేశం శనివారం ముగిసింది. ఈ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను తెలియజేసి కీలక నిర్ణయాలను వెల్లడించారు.
GST Council Meet : ఈ ఏడాది తొలి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం శనివారం జరగనుంది. ఇందులో ఆన్‌లైన్ గేమింగ్‌పై పన్ను విధించడం, ఎరువులపై పన్ను తగ్గింపుకు సంబంధించి పార్లమెంటరీ కమిటీ సిఫార్సుతో సహా పలు అంశాలపై చర్చించాలని భావిస్తున్నారు.
GST on Online Game: ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందాలు, క్యాసినోలపై 28 శాతం జీఎస్టీ విధించనున్నట్లు ప్రభుత్వం ధృవీకరించింది. ఈ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ చట్టాలు సవరించబడ్డాయి.
GST: చక్కెర రైతులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీపి కబురు చెప్పారు. మెలాసిస్‌పై పన్నులను 28 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్లు జీఎస్టీ కౌన్సిల్ శనివారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ చర్య వల్ల చెరుకు రైతులకు మేలు జరుగుతుంది. పశువుల దాణా ధర కూడా తగ్గుతుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మనుషులు వినియోగించే మద్యాన్ని కూడా లెవీ నుంచి మినహాయించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.
GST: భారతదేశం 2023ని మిల్లెట్ల సంవత్సరంగా జరుపుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ముతక ధాన్యాలను ప్రోత్సహించేందుకు జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్టీకి సంబంధించి నిర్ణయాలు తీసుకునే అపెక్స్ బాడీ ముతక ధాన్యాలకు సంబంధించిన కొన్ని ఉత్పత్తులపై పన్నును తగ్గించాలని నిర్ణయించింది.