పెద్దపల్లి జిల్లాలో కాళ్ళు చేతులు కట్టేసి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల వైద్యం చేసారు. అయితే ఆ వైద్యుల నిర్లక్ష్యానికి ఉత్తరాఖండ్ కు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఉత్తరాఖండ్ నుండి కర్నూల్ కు కూలి పనికి వెల్తుండగా ఓదెల మండలం పొత్కపల్లి వద్ద ప్రమాదవశాత్తు పడిపోయాడు అతుల్ దలి కూలి. అనంతరం 108 లో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతని కాళ్ళు చేతులు కట్టేయడంతో అతుల్ దలి ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించాడు. దాంతో సూపరింటెండెంట్, డ్యూటీ డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని వైద్య విధాన పరిషత్ రాష్ట్ర కార్యదర్శి కి ఫిర్యాదు చేసాడు కౌన్సిలర్ బెక్కం ప్రశాంత్.