Test Tube baby: ప్రభుత్వాసుపత్రిలో టెస్ట్ ట్యూబ్ బేబీ జననం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే కార్పొరేట్ ఆస్పత్రికి పరుగులు పెడుతున్న రోజులివి. కానీ సర్కారీ ఆస్పత్రుల్లో అంతకుమించిన సౌకర్యాలు వున్నాయి. ఎంతోమంది మహిళా ఉన్నతాధికారులు ప్రభుత్వాసుపత్రిలోనే డెలివరీకి వెళుతున్నారు. తాజాగా ఓ జంట ప్రభుత్వాసుపత్రి వైద్యుల సహకారంతో తల్లిదండ్రులయ్యారు. అదికూడా ఎంతో ఖరీదుగా భావించే ఐవీఎఫ్ పద్దతి ద్వారా ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. బిహార్ రాజధాని పట్నాలోని ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ఆసుపత్రిలో ఈ అరుదైన సంఘటన జరిగింది. రాష్ట్ర చరిత్రలోనే ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో టెస్ట్ ట్యూబ్ బేబీ జన్మించటం ఇదే తొలిసారి అని వైద్యులు చెబుతున్నారు.
ఐవీఎఫ్ కేంద్రంలో తొలిసారి బిడ్డకు జన్మనివ్వటం, ఆ పాప ఆరోగ్యంగా ఉండటం చాలా సంతోషకరమైన అంశమని ఆసుపత్రి సూపరింటెండెంట్ మనీశ్ మండల్అంటున్నారు. సహస్రా ప్రాంతానికి చెందిన మిథిలేశ్ కుమార్, అనితా కుమారి దంపతులకు 14 ఏళ్ల క్రితం వివాహం అయింది. అయితే వారికి పిల్లలు లేరు. ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ పురుషుడి శుక్రకణాలు మహిళ అండంతో కలవలేకపోవడం వల్ల వారి కల నెరవేరలేదు. మూడేళ్ళుగా ఐవీఎఫ్ ద్వారా వారికి సంతాన భాగ్యం కలిగించేందుకు డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి.
Also Read
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
అనితా కుమారి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఎన్నో ఎళ్లుగా ఎదురుచూస్తున్న వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. జన్యుపరమైన సమస్యలు ఉండి సంతానం లేని దంపతులకు ఐవీఎఫ్ చాలా ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు. మొత్తం మీద సర్కారీ దవాఖానా అరుదైన ఘనతకు వేదికైంది. కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్ళి లక్షలకు లక్షలు ఖర్చుచేయకుండా ఇలాంటి ఇబ్బందులు వున్నవారు ప్రభుత్వాసుపత్రి వైద్యులను సంప్రదించాలని వారు కోరుతున్నారు. తెలంగాణలో పలువురు మహిళా ఐఎఎస్ లు కూడా ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవించడం శుభపరిణామం.
తాజావార్తలు
-
Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
-
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో సిల్వర్
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!