రోడ్డు ప్రమాదాలకు, అనారోగ్యాలకు కారణమయిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణిస్తారు. కొందరు కోమాలో వుంటారు. ఆయా రోగుల పరిస్థితిని బట్టి డాక్టర్లు వైద్యం అందిస్తారు. డెత్ సర్టిఫికెట్ ఇచ్చారంటే…ఇక ఆ వ్యక్తి చనిపోయినట్టే లెక్క. కానీ యూపీలో ఓ వ్యక్తి చనిపోయినట్టుగా డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చారు. తీరా ఆ వ్యక్తి పోస్ట్ మార్టం చేద్దామని ప్రయత్నిస్తే సదరు వ్యక్తి బతికే వున్నట్టు తేలింది.
యూపీకి చెందిన 45 ఏళ్ళ శ్రీకేష్ కుమార్ మొరాదాబాద్ లో మోటార్ సైకిల్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు. కానీ అతను మరణించినట్టుగా డాక్టర్లు సర్టిఫై చేశారు. బంధువుల రాక కోసం అతడి డెడ్ బాడీని ఫ్రీజర్లో వుంచారు. షరా మామూలుగా డాక్టర్లు మిగతా ఫార్మాలిటీస్ పూర్తిచేసేందుకు రెడీ అయ్యారు. రాత్రంతా ఫీజర్లో వున్నా.. అతడు మాత్రం మరణించలేదు. అతడి శరీరంలో కదలికలు వచ్చాయి. అతడు మరణించినట్టు గవర్నమెంట్ డాక్టర్ సర్టిఫై చేశాడు. ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ రాజేంద్రకుమార్ కూడా అతను బతికి వుండే అవకాశాలు లేవన్నారు.
రోడ్డు ప్రమాదం కావడంతో మెడికో లీగల్ కేసుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అతడు మరణించిన విషయాన్ని తెలియచేశారు. ఫ్రీజర్లో వుంచారు డెడ్ బాడీని. బంధువుల రాకకోసం ఆరుగంటలు భద్రపరిచారు. కానీ ఆరుగంటల తర్వాత అతడు బతికే వున్నట్టు తేలడంతో నోరెళ్ళబెట్టారు డాక్టర్లు. 45 ఏళ్ళ శ్రీకేష్ కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కానీ కోమాలో వున్నట్టు డాక్టర్లు తెలిపారు. ఇది ఒక అద్బుతమయిన సంఘటనకు తక్కువేం కాదన్నారు డాక్టర్లు. బతికే వున్న వ్యక్తి చనిపోయినట్టు ఎలా నిర్దారించారనేదానిపై విచారణ సాగుతోంది.