Nalgonda Govt Hospital: నల్లగొండ సర్కారీ దవాఖానాలో పేషంట్ల పరేషాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు రోగులకు స్వాగతం పలుకుతున్నాయి. ఎన్నిసార్లు సమస్యలపై ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో సమస్యలు, ఇబ్బందులతో సహాజీవనం చేస్తున్నారు పేషంట్లు, వారి అటెండర్లు. సాధారణ సమస్యలకు తోడు… ప్రభుత్వ ఆసుపత్రిలో తాగేందుకు గుక్కెడు తాగునీరు దొరకని పరిస్దితి నెలకొంది. అరగంట పైగా క్యూ లైన్లో నిలబడితే ఒక్క బాటిల్ వాటర్ దొరికితే అదే పదివేలు అన్నట్లుగా తయారైంది పరిస్థితి.
నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో గుక్కెడు తాగునీరు దొరకడం పెద్ద భగీరథ ప్రయత్నమే అని చెప్పాలి. పేషంట్ల కోసం ఆర్వో ఫ్యూరీఫైడ్ ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. పేషంట్లకు వారి అటెండర్లకు శుభ్రమైన, తాగునీరు అందించేందుకు మాతా శిశు కేంద్రంలో ఏర్పాటు చేసింది. కానీ ప్రభుత్వం ఏ లక్ష్యంతో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసిందో ఆ లక్ష్యం నెరవేడం లేదు. ఉదయం 7గంటల నుండి రాత్రి 7 గంటల వరకు అంటే 24 గంటల్లో కేవలం 12 గంటలు మాత్రమే ఆర్వో ప్లాంట్ ద్వారా తాగునీరు అందుబాటులో ఉంటుంది. మిగతా 12గంటలు అంటే చీకటి పడిన తరువాత మంచినీరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పేషంట్లకు అందుబాటులో ఉండవు. ఇప్పటికే మాతా శిశు కేంద్రంలో కెపాసిటికి మించి పేషంట్లు ఉంటుండగా..వారికి తోడు వారి అటెండర్లతో తాగునీరు అవసరం ఉండే వారి సంఖ్య భారీగా ఉంటుంది. దీనికి తోడు వేసవికాలం కావడంతో తాగునీరు అవసరం అధికంగా, వినియోగం కూడా అధికంగానే ఉంటుంది.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
పేషంట్ లు లేదా వారి అటెండర్లు ఉదయం 7 గంటలకు తాగునీరు కోసం క్యూలైన్ లో నిలబడటం కనిపిస్తుంది. క్యూలైన్ లో నిలబడిన వారు ఒక్క వాటర్ బాటిలో మాత్రమే నీరు నింపేందుకు అవకాశం ఇస్తారు ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్వాహకులు. చాలా సన్నగా వచ్చే నీటిధార వల్ల ఒక్కలీటర్ లేదా రెండు లీటర్ల బాటిలో నీరు నింపుకొవడానికి 5 నుండి 10 నిమిషాల సమయం పడుతుంది. దీంతో తాగునీరు పట్టుకునేందుకు తమ వంతు వచ్చే సరికి దాదాపు 30నిమిషాలకు పైగా సమయం పడుతుండంతో పేషంట్ల అడెండర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు దాదాపు గంట వరకు సమయం పడుతుండటం…. పేషంట్ల వద్ద అటెండర్లు అందుబాటులో లేకపొవడం ఇబ్బందులకు గురవుతున్నారు.
మరికొన్నిసార్లైతే కొందరు పేషంట్లకు అటెండర్లు లేకపోవడంతో నేరుగా పేషంట్లే వచ్చి తాగునీరు కోసం గంటసేపటి వరకు క్యూలైన్ లో నిలబడి ఒక్కలీటర్ లేదా రెండు లీటర్ల బాటిల్స్ తాగునీరు పట్టుకుని వెళ్లిపోతున్నారు. రెండో బాటిల్ వాటర్ కావాలంటే మరోసారి క్యూలైన్ లో నిలబడటం తప్పనిసరి. కేవలం ఉదయం పూట మాత్రమే అందుబాటులో ఉండే తాగునీరు పట్టుకోవడం ఓ ప్రహాసనం. రాత్రిపూట తాగునీరు ఆసుపత్రిలో అందుబాటులో ఉండకపోవడం ఓప్రత్యక్ష నరకం.
తాగునీరు కావాలంటే బ్రాండెడ్ వాటర్ బాటిల్ కొనాలి. అదికూడా అర కిలోమీటరు ఆసుపత్రి బయటకు నడిచి వెళ్ళాల్సిందే. ప్రసవం కోసం వచ్చే పేషంట్లు డెలివరీ తరువాత వారం రోజుల వరకు ఆసుపత్రిలో చికిత్స తీసుకునే అవకాశం ఉంది. ఈవిధంగా వారం రోజులపాట ఉండి ట్రీట్ మెంట్ తీసుకునే పేషంట్లు, వారి అటెండర్లకు మాత్రం నల్లగొండ జిల్లా కేంద్ర ఆసుపత్రి తాగునీటి నిర్వహణ కన్నీటిని తెప్పిస్తుంది. జిల్లాకు చెందిన మంత్రులు ఈ విషయంలో శ్రద్ధ చూపాలని రోగుల బంధువులు కోరుతున్నారు.
Gouravelli Project Issue: లాఠీ చార్జ్ చేయలేదు.. తోపులాట మాత్రమే జరిగింది..
తాజావార్తలు
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!