అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బిట్స్ పిలాని కళాశాల వేదికగా జరుగుతున్న వేడుకలలో ముఖ్యఅతిథిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. బిట్స్ పిలాని కళాశాలలో వీ ఫర్ యూ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
Governor Tamilisai: గవర్నర్ తమిళి సై ‘ఎక్స్’ ఖాతా హ్యాక్ విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. ముంబై నుంచే గవర్నర్ తమిళి సై ‘ఎక్స్’ ఖాతా హ్యాక్ అయినట్లు గుర్తించారు.
ముఖ్యమంత్రి నితీషే కాదు.. తామేమీ తక్కువ కాదంటూ ఆర్జేడీ కూడా వేగంగా పావులుకదుపుతోంది. మహాకూటమితో తెగతెంపులు చేసుకునేందుకు నితీష్‌కుమార్ సిద్ధపడుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆర్జేడీ కూడా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రణాళికలు రచిస్తోంది. బీహార్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై శనివారం మధ్యాహ్నం ఆర్జేడీ నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఆర్జేడీ నేత, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసంలో ఆ పార్టీ నేతలు సమావేశం అయ్యారు. ఈ భేటీలో రాజకీయ సంక్షోభం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
TamilaSai: తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆమె సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో శీతాకాల విడిది కోసం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, అధికారులు సాదర స్వాగతం పలికారు. ఈ నెల 23 వరకు ఐదు రోజుల పాటు.. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. అనంతరం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.
రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు కలిశారు. ప్రభుత్వం సంప్రదాయం పాటించలేదని గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ నియామకంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీనియర్లు ఉన్నప్పటికీ అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. ఈ క్రమంలో నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి బీజేపీ ఎమ్మెల్యేలు వినతి పత్రం అందించారు.
తెలంగాణలో అసెంబ్లీ రద్దు చేస్తున్నట్లు రాజ్ భవన్ వర్గాలు గెజిట్ విడుదల చేస్తుంది. అయితే, కొత్త అసెంబ్లీ శాసనసభను ఏర్పాటు చేస్తూ కూడా జీవోను జారీ చేసింది.
Supreme Court: 'ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు నిజమైన అధికారం ఉంటుంది. వారు రాష్ట్రాలు, కేంద్రంలోని ప్రభుత్వాలలో రాష్ట్ర శాసనసభ, పార్లమెంటు ప్రతినిధులగా ఉంటారు' అని సుప్రీంకోర్టు పేర్కొంది.
Tamilisai: నా మీద రాళ్ళు విసిరితే.. వాటితో భవంతులు కడతా.. దాడి చేసి రక్తం చూస్తే...ఆ రక్తంను సిరగా మార్చి నా చరిత్ర రాస్తా అని గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సీఎం కేసీఆర్ వరుసగా మూడోసారి రాజ్ భవన్ లో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. బీఆర్‌ఎస్ అధినేతతో పాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సైతం ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఇక.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ఎట్‌హోమ్ ప్రోగ్రాంలో కనిపించకపోవడం గమనార్హం.