Tamilisai: మోడీ నాయకత్వంతోనే మహిళ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందిందని గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయడం సంతోషంగా ఉందని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్‌భవన్‌లో గవర్నర్ ధన్యవాదాలు తెలిపే సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు ప్రధాని మోదీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాలపై ప్రేమతో వైద్య వృత్తికి దూరమయ్యారు. రాజకీయాల్లో పురుషాధిక్యత ఎక్కువ. నేను గవర్నర్ అయ్యాక ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. ఆయన గవర్నర్ అయిన సమయంలో ఇద్దరు మహిళలు మంత్రులు అయ్యారని అన్నారు. రాజకీయాల్లో అవకాశాలు కోసం మహిళలు చాలా కష్ట పడాల్సి ఉంటుందని అన్నారు.
గవర్నర్ కంటే ముందు నేను రాజకీయ నాయకురాలిని.. దాంట్లో రహస్యం, దాచి పెట్టడానికి ఏమి లేదన్నారు. తెలంగాణలో కొందరు నన్ను రాజకీయ నాయకురాలు అంటారు…అది నిజమే కదా! అన్నారు. నేను తెలంగాణ గవర్నర్ గా వచ్చినపుడు రాష్ట్ర క్యాబినెట్ లో మహిళ మంత్రులు లేరని అన్నారు. గవర్నర్ అయిన తర్వాత మహిళ మంత్రులతో ప్రమాణం చేయించిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రోటోకాల్ ఇచ్చిన… ఇవ్వకున్న పని చేసుకుంటే పోవాలన్నారు. నా మీద రాళ్ళు విసిరితే …వాటితో భవంతులు కడతా అన్నారు. దాడి చేసి రక్తం చూస్తే… ఆ రక్తంను సిరగా మార్చి నా చరిత్ర రాస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని అవమానాలు ఎదురు అయిన వెనక్కి తగ్గనని అన్నారు. మోడీ నాయకత్వంతోనే మహిళ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందిందని అన్నారు. నా తండ్రి రాజకీయ నాయకుడు అయిన…నేను సాధారణ రాజకీయ కార్యకర్తగా ప్రయాణం ప్రారంభించానని తెలిపారు. కాగా.. ఇవాళ ఢిల్లీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై వెళ్లనున్నారు.
Hyderabad: తీవ్ర విషాదం.. 15వ అంతస్తు నుంచి దూకి ఆరో తరగతి విద్యార్థిని సూసైడ్