కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను కూడా క్షేత్రస్థాయిలో చివరి వ్యక్తికి అందేలాగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అధికారులకు సూచించారు. పెద్ద పెద్ద నగరాల్లో ఉన్న వారికే కాకుండా.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అట్టడుగు వర్గాల వారికి కూడా సంక్షేమ పథకాలు అందేలాగా చూడాలని గవర్నర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని ప్రొరోగ్ చేశారు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్.. అసెంబ్లీని ప్రొరోగ్ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.. ఇక, అసెంబ్లీని ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ జారీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయ్యింది..
బీఆర్ఎస్పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర గవర్నర్ను కలవడానికి సిగ్గుండాలని మండిపడ్డారు. అసలు గవర్నర్ వ్యవస్థపై బీఆర్ఎస్ నాయకులకు నమ్మకం ఉందా..? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు అప్పటి గవర్నర్ను అనేక విధాలుగా కేసీఆర్ అవమానించారని తెలిపారు. అలాంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు రాజ్యాంగాన్ని రక్షించాలని గవర్నర్ ఆశ్రయించడం సిగ్గు చేటు అని మండిపడ్డారు.
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అందించారు. ఇవాళ సాయంత్రం గవర్నరును కలిసి రాజీనామా సమర్పించారు. ఈ క్రమంలో.. గవర్నర్ సవాంగ్ రాజీనామాను ఆమోదించారు. కాగా.. వైసీపీ ప్రభుత్వంతో అంటకాగారని సవాంగ్ పై ఆరోపణలు వచ్చాయి. సవాంగ్ వైసీపీ హయాంలో డీజీపీగా పని చేశారు. ఆ తర్వాత ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా నియమించారు. అయితే.. సవాంగ్ పదవీ విరమణకు ఇంకా రెండేళ్ల సమయం…
కర్ణాటకలోని గిరిజనాభివృద్ధి సంస్థ నుంచి ప్రైవేటు బ్యాంకు ఖాతాల్లోకి భారీ మొత్తంలో నిధులను అక్రమంగా మళ్లించారనే ఆరోపణలతో ఆ రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖ మంత్రి బి నాగేంద్ర గురువారం తన పదవికి రాజీనామా చేశారు. కర్ణాటక షెడ్యూల్డ్ తెగల సంక్షేమం, యువజన సాధికారత, క్రీడల శాఖ మంత్రి బి నాగేంద్ర తన మంత్రి పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు బెంగళూరులో పత్రాన్ని సమర్పించారు.
రష్యా తాజాగా ఉక్రెయిన్‌పై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఏడుగురు ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బఫర్‌జోన్ ఏర్పాటే లక్ష్యంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఉధృతం చేసింది
Telagana Governor Radha Krishnan: తెలంగాణ ఇన్‌ఛార్జ్ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ ఉదయం రాజ్‌భవన్‌లో ప్రధాన న్యాయమూర్తి లోక్ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయించారు.
గవర్నర్ తమిళిసై పై మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలు చేశారు. సిద్ధిపేటలో రూ.5 లక్షలతో నిర్మించే ఏకలవ్యమిత్ర మండలి భవనానికి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీగా ఎరుకలి కులానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణకి కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.. కానీ గవర్నర్ మాత్రం ఆమోదించకుండా ఏ విధంగా అన్యాయం చేశారో అందరికీ తెలుసని ఆరోపించారు. కేసీఆర్ చేసిన దానిని రిజెక్ట్ చేసే అధికారం లేదని కోర్టు చెప్పింది.. హైకోర్టు ఈ విషయాన్ని…