Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని ప్రొరోగ్ చేశారు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్.. అసెంబ్లీని ప్రొరోగ్ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.. ఇక, అసెంబ్లీని ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ జారీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయ్యింది.. దీంతో.. ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ జారీపై ఏపీ ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది.. సుమారు రూ. 1 లక్ష కోట్లతో నాలుగు నెలల కోసం ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది.. ఇవాళ లేదా రేపు ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేస్తుందనే చర్చ సాగుతోంది..
Read Also: OTT : ఈ వారం ఓటీటీలో రాబోతున్న సినిమాలు ఏవో తెలుసా..?
కాగా, సార్వత్రిక ఎన్నికల కంటే ముందు జరిగిన బడ్జెట్ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది అప్పటి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. మళ్లీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని ఈ సందర్భంగా వైఎస్ జగన్ ప్రకటించారు.. ఇక, సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని ముఠగట్టుకుంది.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుందని భావించినా.. వివిధ శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వచ్చిన సర్కార్.. అసలు, బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కూడా వీలుగా ఉన్న పరిస్థితులు లేవని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.. ఈ నేపథ్యంలో.. నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి.. ఆ తర్వాత మళ్లీ ప్రవేశపెట్టే అవకాశం ఉందంటున్నారు ఆర్థికనిపుణులు..