రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో యాదాద్రికి చేరుకున్న రాష్ట్రపతికి మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, విప్ సునీత, ఆలయ ఈవో గీతారెడ్డిలు ప్రత్యేకంగా స్వాగతం పలికారు.
మరోసారి రాజ్‌భవన్‌కు దూరంగా ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. అయితే, ఇవాళ వస్తున్నారంటూ ముందుగా సమాచారం ఇచ్చి.. చెప్పకుండానే దూరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ వేదికగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, మంత్రులు, అధికార పార్టీకి చెందిన నేతలు హాజరు కాకపోవడం చర్చగా మారింది.. Read…
IIIT Basar Students To Discuss Problems With Governor Tamilisai: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది. వర్సిటీలొో నెలకొన్న సమస్యలను గవర్నర్ దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లారు. అయితే ఈ విషయంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇటీవల కాలంలో బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలు వార్తల్లో నిలుస్తున్నాయి. వరసగా వర్సిటీల్లో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు నిరసన, ఆందోళనలు చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు సక్రమంగా…
తమిళిసై సౌందర్ రాజన్.. క్లౌడ్ బరస్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇప్పుడు వచ్చిన వరదలు క్లౌడ్ బరస్ట్ కాదని తేల్చేసిన ఆమె.. ఎగువ ప్రాంతంలో ఎప్పుడూ వచ్చే వరదలే, కాకపోతే ఇప్పుడు కొంచెం ఎక్కువగా వరదలొచ్చాయని తెలిపారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. వరద పరిస్థితులను పరిశీలించడంతో పాటు బాధితులను పరామర్శించనున్నారు. ఈనేపథ్యంలో.. నిన్న రాత్రి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రైలులో కొత్తగూడెంకు బయల్దేరి వెళ్లారు గవర్నర్. అయితే.. అక్కడి నుంచి భద్రాచలంలో గోదావరి వరద కారణంగా జిల్లాలో ఉత్పన్నమైన పరిస్థితులను పరిశీలించడంతో పాటు వరద బాధితులతో గవర్నర్ మాట్లాడనున్నారు. అయితే.. భద్రాచలం టౌన్ తో పాటు చుట్ట పక్కల ముంపు ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. గోదావరి…
తెలంగాణలో వరుస ఆత్మహత్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు బీజేపీ నేతలు.. రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళిసైని కలిసిన బీజేపీ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు.. ఖమ్మం సాయి గణేష్ ఆత్మహత్య, కామారెడ్డిలో సంతోష్, పద్మల ఆత్మహత్యలపైన సీబీఐతో విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు… రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ హత్యలు, పోలీసుల ప్రవర్తనపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామన్నారు.. ప్రతిపక్ష…
తెలంగాణ సర్కార్-రాజ్‌భవన్ మధ్య క్రమంగా దూరం పెరుగుతూ పోతోంది… గవర్నర్ తమిళిసై బహిరంగంగానే ప్రభుత్వం, ప్రభుత్వాధినేతలపై విమర్శలు గుప్పించడం.. ఈ మధ్యే హస్తినలో పర్యటించి.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమైన తర్వాత.. టార్గెట్ రాష్ట్ర ప్రభుత్వం అనే తరహాలో ఆమె చేసిన వ్యాఖ్యలు చేయడం చర్చగా మారింది.. అయితే, అదే రేంజ్‌లో టీఆర్‌ఎస్ నుంచి కౌంటర్ ఎటాక్ స్టార్ట్ అయ్యింది.. ఈ నేపథ్యంలో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేవారు..…