తెలంగాణలో గత కొంత కాలంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. అధికారపక్షానికి, గవర్నర్‌కు క్రమంగా దూరం పెరుగుతూ పోతోంది.. కొన్ని సార్లు ప్రత్యక్షంగా.. పరోక్షంగా ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై కామెంట్లు కూడా చేశారు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. ఈ మధ్య రాజ్‌భవన్ వేదికగా నిర్వహించిన ఉగాది వేడుకల్లోనూ.. ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలను ఉగాది ఉత్సవాలకు ఆహ్వానించినా వారు ఎవరు రాలేదని గవర్నర్ తమిళిసై అసంత్రృప్తి వ్యక్తం చేశారు.…
తెలంగాణ సీఎం కేసీఆర్-గవర్నర్ తమిళిసై మధ్య గ్యాప్ క్రమంగా పెరుగిపోతోందనే వార్తలు వస్తున్నాయి.. గవర్నర్ ప్రసంగంలేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ప్రారంభం కావడంపై పలు విమర్శలు వచ్చాయి.. అయితే, ఇవాళ రాజ్‌భవన్ వేదికగా జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం కేసీఆర్‌పై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. రాజ్ భవన్‌లో గవర్నర్ నిర్వహించిన ఉగాది ఉత్సవాలకు.. సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు దూరంగా ఉన్నారు.. ఇక, వివిధ పార్టీలకు చెందిన నేతలు, రాష్ట్ర…
CM KCR to recover quickly from illness says Governor Tamilisai Soundararajan. సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి ఆయన వెళ్లారు. నిన్నటి నుంచి ఎడమ చేయి, నొప్పిగా అనిపిస్తోందని.. నీరసంగా ఉన్నారని సీఎంవో వర్గాలు చెప్పాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ ఎంవీ రావు నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు పలు వైద్య పరీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ కు హార్ట్ యాంజియోగ్రామ్, సిటీ స్కాన్…
శాసనసభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావులను… స్పీకర్ సస్పెండ్ చేశారు. బడ్జెట్ ప్రసంగానికి బీజేపీ సభ్యులు అడ్డు తగిలారంటూ… మంత్రి తలసాని తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని ఆమోదించిన సభాపతి… ముగ్గురిపై ఈ సమావేశాల ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగనుంది. ముగ్గురు ఎమ్మెల్యే సస్పెన్షన్‌పై రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైరయ్యారు. రెండు నిమిషాల్లోనే అంతా జరిగిపోయిందన్నారు. ఇక, బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా… రాజ్యాంగాన్ని కేసీఆర్ అపహాస్యం చేస్తున్నారని బీజేపీ సభ్యులు…
తెలంగాణ సర్కార్, గవర్నర్ మధ్య గ్యాప్ పెరుగుతూ పోతోంది.. గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంపై ఇప్పటికే ఘాటుగా స్పందించారు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. ఇక, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ఇప్పటికీ మహిళలకు సరైన గౌరవం దక్కడం లేదన్న ఆమె.. అత్యున్నత పదవిలో ఉన్నవారికి కూడా సరైన గౌరవం దక్కడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక, నన్ను ఎవరూ భయపెట్టలేరని..…
ఎల్లుండి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. అయితే, ఈ సారి గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సెషన్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. దీనిపై స్పందించారు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. ఇది కొత్త సెషన్ కాదనీ, అంతకుముందు జరిగిన సెషన్‌కు కొనసాగింపు కాబట్టి, గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాన్ని ప్రారంభించడం సాధ్యం కాలేదని ప్రభుత్వం పేర్కొందని.. ఈ సాంకేతిక అంశం కారణంగా గవర్నర్ ప్రసంగం సాధ్యం కాదని ప్రభుత్వం తెలిపిందన్నారు.. అయితే,…
ఇందిరా పార్క్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 37వ ‘హునార్ హాత్’లో 30 కంటే ఎక్కువ రాష్ట్రాలు నుండి 700 మందికి పైగా కళాకారులు మరియు హస్తకళాకారులు గొప్ప సంప్రదాయ సమర్పణలతో పాల్గొంటున్నారు. మార్చి 6 వరకు జరిగే ఈ ఎక్స్‌పో కళాకారులు, హస్తకళాకారులకు తమ ఉత్పత్తులను ప్రదర్శించడానికి, విక్రయించడానికి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడేళ్లలో ఈ ఈవెంట్‌లు దాదాపు 8 లక్షల మంది కళాకారులు మరియు కళాకారులకు ఆదాయాన్ని ఆర్జించే అవకాశం కల్పించాయని నిర్వాహకులు…
రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ మేడారం జాతరలో పాల్గొన్నారు.ఈ పర్యటనలో మంత్రులు, కలెక్టర్, ఎస్పీ గైర్హాజర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర తొలి పౌరురాలికి ఇంత అవమానమా? గవర్నర్ కు ఇచ్చే మర్యాద ఇదేనా? మహిళ అని చూడకుండా అవమానిస్తారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా కల్వకుంట్ల రాజ్యాంగం ?కోట్లాదిమంది ప్రజలు సందర్శించే మేడారం జాతరకు వెళ్లకుండా గిరిజనులను సీఎం కేసీఆర్…
మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. వనదేవతలను దర్శించుకున్న ఆమె.. గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు.. ఇక, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వన దేవతలు సమ్మక్క సారలమ్మలను అతి పెద్ద గిరిజన జాతర మేడారంలో దర్శించుకుని, మొక్కులు చెల్లించుకోవడం సంతోషంగా ఉందన్నారు.. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తికి ఈ అతి గొప్ప ఆదివాసీ జాతర ఆదర్శంగా నిలుస్తుందని వెల్లడించారు.. తెలంగాణ ప్రజలంతా…
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు తమిళిసై సౌందరరాజన్ దంపతులు.. నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసైకి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. రాత్రి తిరుమలలోనే బస చేసిన తెలంగాణ గవర్నర్.. ఇవాళ ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన తమిళిసై.. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న ఈ సమయంలో.. ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు… ప్రజలందరూ…