హుజురాబాద్ ఉప ఎన్నికలు జరగనున్న తరుణంలో.. కాంగ్రెస్ పార్టీని వీడి.. అధికార టీఆర్ఎస్‌లో చేరారు పాడి కౌశిక్ రెడ్డి.. ఆ తర్వాత గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డిని శాసన మండలికి పంపనున్నట్టు ప్రకటించారు సీఎం కేసీఆర్.. దీనిపై నిర్ణయం తీసుకున్న తెలంగాణ కేబినెట్.. గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం ఆ ఫైల్‌ను రాజ్‌భవన్‌కు కూడా పంపించారు. అయితే, గవర్నర్ కోటాలో పాడి కౌశిక్ రెడ్డి పేరును ఎమ్మెల్సీగా ప్రభుత్వం సిఫార్సు చేయడంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ప్రభుత్వంపై…
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు మాతృ వియోగం కలిగింది.. తమిళిసై తల్లి కృష్ణకుమారి కన్నుమూశారు. ఆమె వయస్సు 80 ఏళ్లుగా చెబుతున్నారు.. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు కృష్ణకుమారి.. కాసేపట్లో ఆమె భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి చెన్నైకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, కృష్ణకుమారి మాజీ ఎంపీ కుమారినందన్ భార్య.. ఆ దంపతుల పెద్ద కుమార్తె గవర్నర్ తమిళిసై. కృష్ణకుమారి…
కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి వీలుగా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజినల్ ఔట్‌రీచ్ బ్యూరో (ఆర్ఓబీ) కోవిడ్ జాగ్రత్తలు, వ్యాక్సినేషన్‌పై ఏర్పాటుచేసిన డిజిటల్ మొబైల్ వీడియో పబ్లిసిటీ వాహనాలను శనివారం ఆమె రాజభవన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంతకు ముందు ప్రజలలో కోవిడ్ టీకాపై ఉన్న సంశయం క్రమంగా తొలగిపోయి ప్రస్తుతం భారత్ 42…
అన్ని రంగాల్లోనూ మహిళ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్… మహిళా సాధికారత, సమానత్వం సాధించాలంటే, భిన్నత్వాన్ని, సమ్మిళిత సమాజాన్ని సాధించాలంటే మహిళా నాయకత్వాన్ని అన్ని దశలలోనూ పెంపొందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.. హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమెన్ లీడర్స్ ఫోరమ్‌ను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన గవర్నర్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్పొరేట్ రంగంలో, అలాగే వివిధ వ్యవస్థలలో సీనియర్ పొజిషన్‌లో మహిళా నాయకత్వం చాలా తక్కువ ఉందని…
తెలంగాణ రాష్ట్రం ఇవాళ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటుంది.. కరోనా సమయంలో.. ఎలాంటి హడావుడి లేకుండా కార్యక్రమాలు నిర్వహించారు.. ఉదయం అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ఆ తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లి.. గవర్నర్ తమిళిసైని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం.. ఇవాళ గవర్నర్ పుట్టిన రోజు కూడా కావడంతో ఆమెకు బొకేను అందించిన విషెష్ చెప్పారు.. ఆమె ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. తాజా పరిస్థితులపై…